☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్

TTD Tickets:తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమలలో 77,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు 28,977 మంది భక్తులు తలనీలాలు సమర్పించి...
జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్

TTD Tickets:తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమలలో 77,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు 28,977 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఒక్కరోజులో రూ.2.96 కోట్ల ఆదాయం వచ్చింది.

Read Also:Saddula Bathukamma: నేడే సద్దుల బతుకమ్మ వేడుకలు..సద్దుల బతుకమ్మకు ఆ పేరెలా వచ్చింది?

తిరుమలలో రద్దీ.. 14 గంటల వరకు దర్శన సమయం

TTD Tickets

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. తిరుమలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణాన్ని, దర్శన సమయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్ల వివరాలు తెలుసుకోవచ్చు, అందుబాటులో ఉన్న కోటా ప్రకారం బుక్ చేసుకోవచ్చు.

ఆర్జిత సేవల టికెట్లు

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల టికెట్లను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనేందుకు అక్టోబర్ 21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు కేటాయించిన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలి. గడువులోగా చెల్లింపు చేసిన వారికి మాత్రమే టికెట్లు ఖరారవుతాయి.

ఇతర సేవల టికెట్ల విడుదల తేదీలు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అంగప్రదక్షిణ టోకెన్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా అదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

TTD Tickets:రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదుల కోటా

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు టికెట్ల విడుదల సమయాలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. టికెట్ల లభ్యత, షెడ్యూల్‌లో మార్పుల కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించడం అవసరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు.. కారణమిదేRTC టికెట్ ధరలపై హరీష్ రావు ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com