☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

85 ఏళ్ల వయసులోనూ పేదల కోసం సేవ.. కలెక్టర్ చొరవతో ‘రూపాయి ఇడ్లీ’కి మళ్లీ ఊపిరి!

కోయంబత్తూరు కమలాతల్ బామ్మ 30 ఏళ్లుగా పేదల ఆకలి తీర్చేందుకు రూ.1కే ఇడ్లీలు అందిస్తున్నారు. ఆమెకు పదేళ్లుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు లభించగా, ఇటీవల అవి నిలిచిపోయాయి. దీనితో సేవ కొనసాగించడం కష్టమైంది. బామ్మ సమస్యను గుర్తించిన జిల్లా కలెక్టర్, వెంటనే స్పందించి ఉచిత గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో ఆమె 'రూపాయి ఇడ్లీ' సేవ మళ్లీ సజావుగా సాగుతుంది.
85 ఏళ్ల వయసులోనూ పేదల కోసం సేవ.. కలెక్టర్ చొరవతో ‘రూపాయి ఇడ్లీ’కి మళ్లీ ఊపిరి!

కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరు సమీపంలోని వడివేలంపాలయం ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల కమలాతల్ బామ్మ సేవ మరోసారి వార్తల్లో నిలిచింది. గత 30 ఏళ్లకు పైగా పేదలు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఆమె కేవలం రూ.1కే ఇడ్లీలు విక్రయిస్తూ వస్తున్నారు. ధర పెంచకుండా తన సేవను కొనసాగిస్తున్న కమలాతల్ బామ్మకు స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

మొదట్లో కట్టెల పొయ్యిపై ఇడ్లీలు తయారు చేసిన ఆమెకు.. గత పదేళ్లుగా ఆమె సేవకు గుర్తింపుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి. అయితే గత రెండు నెలలుగా ఈ ఉచిత సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో ఇడ్లీలు తయారు చేయడానికి ఇబ్బందులు ఎదురవడంతో పాటు, రూపాయికే ఇడ్లీలు అందించే తన సేవను కొనసాగించడం కష్టంగా మారింది. దీంతో కమలాతల్ బామ్మ స్వయంగా కోయంబత్తూరు జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను కలిశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరాను తిరిగి కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

బామ్మ సమస్యను అధికారులు సంబంధిత మంత్రి సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. కమలాతల్ బామ్మకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో బామ్మకు ఊరట లభించింది. పేదల కోసం ఆమె కొనసాగిస్తున్న ‘రూపాయి ఇడ్లీ’ సేవకు మళ్లీ ఎలాంటి ఆటంకం లేకుండా మార్గం సుగమమైంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tollywood : చిట్టి గౌనులో గ్లామర్ అరాచకం.. సోషల్ మీడియాలో యంగ్ హీరో భార్య సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?IND vs WI Series: భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌కు రంగం సిద్ధం.. ఎక్కడ చూడాలంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com