☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Tollywood : చిట్టి గౌనులో గ్లామర్ అరాచకం.. సోషల్ మీడియాలో యంగ్ హీరో భార్య సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ హీరోహీరోయిన్స్ చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరో భార్య షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆమె బుల్లితెరపై చాలా ఫేమస్. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood : చిట్టి గౌనులో గ్లామర్ అరాచకం.. సోషల్ మీడియాలో యంగ్ హీరో భార్య సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tejaswi Gowda

బుల్లితెరపై తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో విశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న నటి తేజస్విని గౌడ. ప్రముఖ బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి భార్యగా కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్విని, తన లేటెస్ట్ ఫొటోషూట్‌లు, పర్సనల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Tejaswi Gowda Age

ఈ క్రమంలోనే తేజస్విని ఇటీవల పర్పుల్ కలర్ మోడర్న్ గౌనులో చేసిన ఫొటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంప్రదాయ చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది, ఈ రకమైన వెస్టర్న్ అవుట్‌ఫిట్‌లో చాలా క్యూట్‌గా, గ్లామరస్‌గా దర్శనమిచ్చింది. లూజ్ హెయిర్, సింపుల్ మేకప్, ఆకట్టుకునే నవ్వుతో ఇచ్చిన భంగిమలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tejaswi Gowda News

బుల్లితెర సీరియళ్ల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని, నిత్యం డిఫరెంట్ ఫ్యాషన్ శైలులను ట్రై చేస్తూ ట్రెండీ లుక్స్‌లో అలరిస్తుంటుంది. ఒకవైపు ట్రెడిషనల్ వేర్‌లో పద్ధతిగా కనిపిస్తూనే, మరొకవైపు వెస్టర్న్ గౌన్లలో ఎంతో అందంగా మెరిసిపోతూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతోంది. ఈ లేటెస్ట్ క్యూట్ పిక్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు "బ్యూటిఫుల్", "చాలా క్యూట్‌గా ఉన్నారు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tejaswi Gowda Stunning

తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న తేజస్విని, తమిళ టెలివిజన్ పరిశ్రమలో పలు ప్రముఖ సీరియళ్లలో నటించి మెప్పించారు. ముఖ్యంగా జీ తమిళం ఛానల్‌లో ప్రసారమైన ‘విద్యా రాణి’ (Vidya Rani) సీరియల్ ఆమెకు తమిళంలో విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇందులో శీర్షికా పాత్ర (టైటిల్ రోల్) పోషించిన తేజస్విని, తన నటనలోని భావోద్వేగాలు, సహజత్వంతో తమిళ ఇళ్లల్లో కుటుంబ ప్రేక్షకులను అలరించారు.

Tejaswi Gowda Stunns

తమిళ ప్రాజెక్ట్‌లతో పాటు అమర్‌దీప్ చౌదరితో వివాహం తర్వాత కూడా తన నటనను కొనసాగిస్తూ సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తమిళ, తెలుగు నాట సమానమైన ప్రజాదరణ పొందుతూ బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతున్నారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు పొందుతూ సౌత్ ఇండియన్ టెలివిజన్ రంగంలో లీడింగ్ నటీమణులలో ఒకరిగా పేరు గాంచారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← ODI World Cup: వన్డే ప్రపంచ కప్‌లో ‘స్టాప్ క్లాక్’ నియమం.. ఇకపై ఆ పప్పులు ఉడకవంతే..!85 ఏళ్ల వయసులోనూ పేదల కోసం సేవ.. కలెక్టర్ చొరవతో ‘రూపాయి ఇడ్లీ’కి మళ్లీ ఊపిరి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com