☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

Minister Satyakumar Yadav: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా.. తమకు కేటాయించే స్థానాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది.. ఈ పథ్యంలో మంత్రి సత్యకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 72 నూతన 104 ఎంఎంయూ (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, […]
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

Minister Satyakumar Yadav: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా.. తమకు కేటాయించే స్థానాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది.. ఈ పథ్యంలో మంత్రి సత్యకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 72 నూతన 104 ఎంఎంయూ (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, హెల్త్ కమిషనర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం నూతన వాహనాలతో ధర్మవరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలపై సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు. వారి త్యాగాలను వృథా కానివ్వబోమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సత్యకుమార్ చెప్పారు. కింది స్థాయిలోనూ మూడు పార్టీల నేతలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. గతంలో మాదిరిగా అప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని మంత్రి సత్యకుమార్ అన్నారు. ధర్మవరంలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆ అభివృద్ధిని ప్రజల ముందుంచి ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com