☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ములుగు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు

ములుగు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు Caption of Image. ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ములుగులో రూ.15 కోట్లతో అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ములుగు, తాడ్వాయి మండలాల్లో మంత్రి పర్యటించారు. ములుగు మున్సిపాలిటీ 4వ వార్డు లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.5.95 కోట్ల పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులతో నిర్మించిన ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డును కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ములుగు ప్రభుత్వ జనరల్‌‌‌‌‌‌‌‌
ములుగు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు
ములుగు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు

ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ములుగులో రూ.15 కోట్లతో అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ములుగు, తాడ్వాయి మండలాల్లో మంత్రి పర్యటించారు. ములుగు మున్సిపాలిటీ 4వ వార్డు లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.5.95 కోట్ల పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులతో నిర్మించిన ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డును కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ములుగు ప్రభుత్వ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రిలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. తాడ్వాయిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.7 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ములుగు పట్టణంలో రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సీతక్క తెలిపారు.

రామప్ప పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల కల్పన పనులు కొనసాగుతున్నాయని, మేడారంలో 30 పడకల ఆస్పత్రి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ అతిథిగృహం, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గిరిజన ఆవాసాలు, ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇటీవల సీసీ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

మారుమూల గ్రామాలకు ఆయుర్వేద వైద్యసేవలను చేరువ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏటూరునాగారం ఆయుర్వేద ఆసుపత్రికి సిబ్బందిని ఏర్పాటు చేశామని, భవనం, వైద్య పరికరాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్పీ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేకన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కాసిందేవిపేటలో నీటికుంటలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్వెలుగు స్పెషల్ : అనుసంధాన భాషగా ఇంగ్లిష్ మంచిదేమో! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com