Former Inspector of Keesara : హైదరాబాద్ శివారు కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ అరకపల్లి ఆంజనేయులు అక్రమార్జన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే లంచం కేసులో అరెస్టయిన ఆయనపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏసీబీ అధికారులు చేపట్టిన విస్తృత సోదాల్లో ఆంజనేయులు సంపాదించిన అపారమైన అక్రమాస్తుల లెక్కలు బయటపడటంతో పోలీస్ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న విలువైన ప్లాట్లు, విలాసవంతమైన ఇళ్లు, వ్యవసాయ భూములు, భారీగా బంగారం మరియు నగదును అధికారులు గుర్తించారు.
Read Also ; తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి, కేసీఆర్
మార్కెట్ విలువ రూ. 20 కోట్లకు పైనే.. బినామీలపై ఏసీబీ ఫోకస్!
ఏసీబీ అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రభుత్వ ప్రభుత్వ నమోదు విలువ (పత్రాల విలువ) ఆధారంగా గుర్తించిన ఆస్తుల విలువ రూ. 2.28 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. సీఐ ఆంజనేయులు సర్వీసు కాలంలో సాధించిన ఈ ఆదాయం మూలాల పై, అలాగే ఆయన ఎవరెవరి పేరిట బినామీ లావాదేవీలు నిర్వహించారనే కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన ఇతర స్థిరాస్తుల సమాచారాన్ని సేకరించేందుకు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఖాతాలను కూడా ఏసీబీ ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






