☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కూతురి పెళ్లి తర్వాత షర్మిల రూట్ మ్యాప్..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు రాష్ట్రంలో కాస్త మందగించాయి. దీనికి తోడు వైఎస్ షర్మిల తన వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం కూడా ఒక కారణం. ఇటీవల ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరు రాష్ట్రాల ముఖ్య నాయకులు హాజరై సందడి చేశారు. కాగా, నవంబర్ 25న వివాహ వేడుక, డిసెంబర్ […] The post కూతురి పెళ్లి తర్వాత షర్మిల రూట్ మ్యాప్..? appeared first on Telugu Rajyam.
కూతురి పెళ్లి తర్వాత షర్మిల రూట్ మ్యాప్..?
Not coordinating with the leaders of her own party

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు రాష్ట్రంలో కాస్త మందగించాయి. దీనికి తోడు వైఎస్ షర్మిల తన వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం కూడా ఒక కారణం. ఇటీవల ఆమె కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరు రాష్ట్రాల ముఖ్య నాయకులు హాజరై సందడి చేశారు. కాగా, నవంబర్ 25న వివాహ వేడుక, డిసెంబర్ మొదటి వారంలో రిసెప్షన్ ముగియనున్నాయి.

ఈ పండుగ వాతావరణం ముగిసిన వెంటనే.. డిసెంబర్ రెండో వారం లేదా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పక్కా స్కెచ్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకల ఆహ్వాన పత్రికలను అందించే క్రమంలో షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారనే వార్తలు, దీనివల్ల ఏపీ రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం నెట్టింట జోరందుకుంది. అయితే, ఈ రూమర్లపై వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు.

“నా కుమార్తె వివాహానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించడం ఒక కనీస మర్యాద, ఇందులో ఎలాంటి అసాధారణ విషయం లేదు. నా కూతురి పెళ్లిని అడ్డుపెట్టుకుని దొడ్డిదోవన రాజకీయం చేసే ఖర్మ నాకు పట్టలేదు” అంటూ తన పొలిటికల్ క్రెడిబిలిటీని దెబ్బతీయాలని చూసేవారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన రాజకీయాలు ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

కుటుంబ బాధ్యతలు ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ అంతర్గత వర్గాల టాక్. గతంలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో ఆమె చేసిన 9 రోజుల రాష్ట్ర పర్యటన క్యాడర్‌లో మంచి జోష్ నింపింది. ఇప్పుడు అదే తరహాలో సుదీర్ఘ జిల్లాల పర్యటనలు, బహిరంగ సభల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు.. ప్రధానంగా బలహీనపడిన వైసీపీ ఓటు బ్యాంకును ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం, వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండబోతున్నాయి. మొత్తానికి, ఇప్పటివరకు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్యే ప్రధాన పోరు సాగుతుండగా.. కూతురి పెళ్లి తర్వాత వైఎస్ షర్మిల పూర్తిస్థాయిలో జిల్లాల పర్యటనలతో రోడ్లపైకి వస్తే ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఒకవైపు అన్న వైఎస్ జగన్ సొంత బాబాయ్ కేసు, అంతర్గత కుంపట్లతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు షర్మిల కాంగ్రెస్ జెండాతో క్షేత్రస్థాయిలోకి దూసుకురావడం వైకాపాకు మరిన్ని సవాళ్లను తెచ్చిపెట్టేలా ఉంది.

The post కూతురి పెళ్లి తర్వాత షర్మిల రూట్ మ్యాప్..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వైసీపీ కోటపై సాయిరెడ్డి సర్జికల్ స్ట్రైక్..?వివేకా కేసులో జగన్, భారతిలకు ఉచ్చు బిగుస్తుందా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com