☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..

శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు.. తెలుగు సినిమాకు తన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకులు. 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. సినిమాలపై మక్కువతో తనకు ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన సింగీతం గారు అసోసియేట్ డైరెక్టర్‌గా దొంగ […]
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..

శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు.. తెలుగు సినిమాకు తన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకులు. 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. సినిమాలపై మక్కువతో తనకు ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన సింగీతం గారు అసోసియేట్ డైరెక్టర్‌గా దొంగ రాముడు, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, మాయాబజార్, జగదేకవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధంకు పని చేశారు. 1972లో తన తొలి తెలుగు చిత్రం నీతి నిజాయితీతోనే తనదయిన ముద్ర వేశారు. మయూరి, ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు.

పుష్పక విమానంతో మూకీ సినిమా, ఆదిత్య 369లో టైమ్ మెషిన్ లో వర్తమాన కాలం నుండి భవిష్యత్ కాలానికి వెళ్లడం, సింగ్ గీతం సినిమాతో పాటలనే మాటలుగా సినిమా చేయడం వంటి ఎన్నో ప్రయోగాలతో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీసిన మయూరి సూపర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా 14 నంది అవార్డులను గెలుచుకుంది. భైరవ ద్వీపం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. తన సినీ ప్రయాణంలో 60 సినిమాలు చేసి.. సింగీతం అంటే ప్రయోగం.. ప్రయోగం అంటే సింగీతం అనేలా ఖ్యాతిని అందుకున్నారు.

94 ఏళ్ల వయసులో ఇటీవల సింగ్ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించి తనకు వయసుతో సంబంధం లేదని తాను ఎప్పటికి రిటైర్మెంట్ తీసుకోనని తనసినిమాలలో వైవిద్యం ఏపాటిదో ఈతరం జెన్ జీ జనరేషన్ కు చూపించారు సింగీతం గారు. అయితే గత కొద్దిరోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న సింగీతం గారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూసారు. మానవ జన్మ అన్నాక ఎదో ఒక రోజు కాలం చేయాల్సినవారే. కానీ అందరిలా వెళ్ళిపోతే ఆయన సింగీతం ఎందుకు అవుతారు. తానూ ఎంచుకున్న కళారంగంలో కనివిని ఎరుగని సినిమాలతో వెండితెరపై ఎవరు చేయనటువంటి అద్భుతాలు సృష్టించి కళామతల్లి ముద్దుబిడ్డగా జేజేలు అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు చేసిన ప్రయోగాల రూపంలో ఎప్పటికి చిరస్థాయిలో నిలిచి ఉంటారు. కానీ ఇన్నేళ్లుగా సినిమా మాంత్రికుడుగా సింగీతం తయారుచేసిన ప్రయోగశాల నేటి నుండి మూతపడింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థRahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com