☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్

నవరాత్రి ఉత్సవాలతో దేశవ్యాప్తంగా పండుగ సందడి కనిపిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లు హోరెత్తుతున్నాయి. కానీ.. ఈసారి స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా మొబైల్ సేల్స్ పడిపోయాయి. ఒకవైపు తగ్గిన డిస్కౌంట్లు.. మరోవైపు పెరిగిన ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. ఈ నవరాత్రికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఎందుకు తగ్గాయి? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? పండుగ సీజన్ అంటేనే స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ […]
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్

నవరాత్రి ఉత్సవాలతో దేశవ్యాప్తంగా పండుగ సందడి కనిపిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లు హోరెత్తుతున్నాయి. కానీ.. ఈసారి స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా మొబైల్ సేల్స్ పడిపోయాయి. ఒకవైపు తగ్గిన డిస్కౌంట్లు.. మరోవైపు పెరిగిన ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. ఈ నవరాత్రికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఎందుకు తగ్గాయి? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది?

పండుగ సీజన్ అంటేనే స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజులతో పోలిస్తే నవరాత్రి, దసరా, దీపావళి సమయంలోనే జనాలు కొత్త ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏటా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 30 నుంచి 35 శాతం ఈ పండుగ సీజన్ లోనే జరుగుతాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈకామర్స్ నవరాత్రి సేల్స్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 16 శాతం పడిపోయాయి. ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నవరాత్రి మొదలైనప్పటి నుంచి రిటైల్ స్టోర్లలో మొబైల్ సేల్స్ 20 శాతం తగ్గాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ – AIMRA చెబుతోంది. దసరా, దీపావళి నాటికి అమ్మకాలు పుంజుకుంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. అయినా సరే పండుగ సీజన్ లో ఓవరాల్ గా రిటైల్ సేల్స్ 15 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని AIMRA అంచనా వేస్తోంది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలోనూ పండుగ సేల్స్ లో 60 నుంచి 65 శాతం వ్యాపారం నవరాత్రి సమయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి ఆ జోరు కనిపించడం లేదు.

మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం ధరలు పెరగడమే. మార్కెట్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే కస్టమర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మెమరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు విపరీతంగా పెరగడం, రవాణా ఖర్చులు తడిసి మోపెడు కావడంతో.. స్మార్ట్ ఫోన్ల ధరలు సగటున 35 నుంచి 40 శాతం మేర పెరిగాయి. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఆన్ లైన్ డిస్కౌంట్లు భారీగా తగ్గాయి. పోయినేడాది పండుగ సేల్స్ లో 25 నుంచి 40 శాతం వరకు ఆన్ లైన్ డిస్కౌంట్లు ఇచ్చారు. ఈసారి అవి కేవలం 10 నుంచి 25 శాతానికే పరిమితం అయ్యాయి. ధరలు పెరగడం, ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేకపోవడంతో కస్టమర్లు ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ద్రవ్యోల్బణ ప్రభావంతో సెప్టెంబర్ నెలలో రిటైల్ స్టోర్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య 40 నుంచి 50 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ధరల మంటతో సామాన్య మధ్యతరగతి వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. బడ్జెట్ కస్టమర్లు కొత్తవి కొనే బదులు సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు పాత ఫోన్లనే రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నారు. అయితే.. మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ 45 వేల రూపాయల పైబడిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగానికి మాత్రం పెద్దగా నష్టం జరగలేదు. ప్రీమియం మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఇక దీపావళి తర్వాత మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల గణాంకాలను పరిశీలిస్తే.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 10 శాతం పడిపోయాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్‌ ఆశలన్నీ ఆ సినిమాలపైనే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com