☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

SPB : ఆ పాట పాడటానికి నరకం చూశా.. రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారట

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలుసుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన పరిస్థితులను పంచుకున్నారు. తాను పాడటానికి సరిపోయే పాటలు అప్పుడు తయారు కావట్లేదని, తన వయసు కారణంగా తన గాత్రంపై ఒక అపోహ ఉందని ఆయన అన్నారు.
SPB : ఆ పాట పాడటానికి నరకం చూశా.. రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారట

భారతీయ సినీ సంగీత దిగ్గజం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఎన్నో మరుపురాని పాటలు పాడారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గీతాంజలి సినిమా పాటల రికార్డింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఎదుర్కొన్న గొంతు సమస్య, వ్యక్తిగత సవాళ్లు, చివరకు శస్త్రచికిత్స ద్వారా కోలుకున్న వైనాన్ని వివరించారు. గీతాంజలి సినిమాకు “ఓ పాప లాలి” పాటను మలయాళం, తెలుగు వెర్షన్లలో రికార్డు చేస్తుండగా ఆయన గొంతు సహకరించలేదని బాలు తెలిపారు. వాయిస్ నాడుల్స్ సమస్య కారణంగా ఆయన పాట పాడేందుకు ఇబ్బంది పడ్డారట. ఒక్కో పదాన్ని కూడా సరిగ్గా ఉచ్ఛరించలేక, రికార్డింగ్ మధ్యలో విరామం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది తనలో తీవ్ర అసహనాన్ని, కోపాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ కష్టాన్ని ఆయన “ఒక నరకం”గా అభివర్ణించారు.

ఈ వైద్య సమస్యతో పాటు, ఇంట్లో ఎదురైన పరిస్థితులు మరొక నరకమని బాలు చెప్పారు. కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో పూజలు, పునస్కారాలు చేయమని బలవంతం చేశారని, తాను కాదని చెప్పినా వాళ్లు నమ్మలేదని తెలిపారు. ఈ నాలుగు నెలల కాలంలో, ప్రతి రోజూ రికార్డింగ్‌ల కోసం ఫోన్లు వస్తూనే ఉండేవని, తాను పాడలేనని చెప్పడానికి కష్టపడ్డానని అన్నారు. డాక్టర్లు సర్జరీ చేయమని సూచించినప్పటికీ, కొందరు సర్జరీ వల్ల గొంతు పూర్తిగా పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తన కోసం వేచి ఉండవద్దని, ఇతరులతో పాటలు పాడించుకోవచ్చని నిర్మాతలకు సూచించారట.

ఈ క్లిష్ట సమయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ బాలుకి ఫోన్ చేసి, గొంతు సమస్య గురించి తెలుసుకున్నారట. సర్జరీ చేయవద్దని, చిన్న టిష్యూ పోయినా గొంతు పోతుందని ఆమె సలహా ఇచ్చారట. అయినప్పటికీ, బాలు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతమై, మత్తు నుంచి బయటకు రాగానే తన గొంతును పరీక్షించుకోగా, అది ఎంతో సౌకర్యవంతంగా పాడటానికి సిద్ధంగా ఉందని ఆశ్చర్యపోయారు. ఈ అనుభవం ఆయనకు ఎంతగానో ఊరటనిచ్చిందట. తన ప్రారంభ రోజుల పాటలు వింటే చాలా చిరాకుగా ఉంటుందని, అలాంటి పాటలు పాడినప్పటికీ పరిశ్రమ తనను ఎలా భరించి అవకాశాలు ఇచ్చిందో ఆశ్చర్యం వేస్తుందని బాలు ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లతా మంగేష్కర్, పి. సుశీల వంటి దిగ్గజాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యంగా శబ్దోచ్చారణలో వారి నైపుణ్యాన్ని కొనియాడారు. ప్రస్తుత తరంలోని కొందరు గాయకులు అక్షర స్ఫుటత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, క్రూనింగ్ ఫ్యాషన్‌గా మారిందని విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG
← వీధి కుక్కలు బైక్‌ను వెంటాడితే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం పొరపాటున చేయకండి..!SBI కస్టమర్లకు అలర్ట్.. మొబైల్ నంబర్లు, ఇంటి అడ్రస్సులతో సహా 3 వేల 897 మంది కస్టమర్ల డేటా డార్క్ వెబ్లో ప్రత్యక్ష్యం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com