☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!

Srikakulam Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా పలాసలో 100.75 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, […]
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!

Srikakulam Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా పలాసలో 100.75 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహాలతో శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ 24 నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాగావళి, వంశధార నదుల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని ఔట్‌ఫ్లో రూపంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేకంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, నదుల ప్రవాహం, తీర ప్రాంత పరిస్థితులపై జిల్లా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు.

జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. సముద్రం, నదులు, వాగులు, వరద నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మొత్తం వణికిపోతోంది. ముఖ్యంగా కళింగపట్నం–గోపాలపురం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతిThe Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com