☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!

Nani Requests CM Revanth Reddy: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబర్ 23) ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమా చూడాలని హీరో నాని ఆశిస్తున్నాడు. ఈ మేరకు నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు […]
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!

Nani Requests CM Revanth Reddy: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబర్ 23) ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమా చూడాలని హీరో నాని ఆశిస్తున్నాడు.

ఈ మేరకు నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాను ఎంతో ఇష్టపడే అభిమానిగా, ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటంలోనే తనకు ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని ఆయన పేర్కొంటూ తనకి సినిమా చూడడానికి అనుమతివ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమని.. నేడు ‘ది పారడైజ్’ ప్రీమియర్ షోకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి, తాము ఎవరి కోసం సినిమా తీశారో ఆ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందన్నారు. ఒక సినిమా రూపొందించిన తర్వాత ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే నటుడిగా తనకు అసలైన సంతృప్తి లభిస్తుందని నాని అన్నారు. ప్రేక్షకులతో కలిసి సినిమా అనుభూతిని పంచుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పోస్టులో రాసుకొచ్చాడు.

ఈ సందర్భంగా అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు నాని పేర్కొన్నారు. ‘ది పారడైజ్’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇదివరకు “పుష్ప” సినిమా విడుదల నేపథ్యంలో జరిగిన ఘటన నేపథ్యంలో.. హీరో నాని సోషల్ మీడియాలో ఇలా విజ్ఞప్తి చేసి ముందు జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చు కాబోలు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com