☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

టాటా ఏరిస్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త సెడాన్ లాంచ్!

Tata Aeris Sedan: సెడాన్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా టాటా మోటార్స్ కొత్త ‘టాటా ఏరిస్’ (Tata Aeris) మోడల్‌ను మార్కెట్లోకి...
టాటా ఏరిస్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త సెడాన్ లాంచ్!

Tata Aeris Sedan: సెడాన్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా టాటా మోటార్స్ కొత్త ‘టాటా ఏరిస్’ (Tata Aeris) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 5.29 లక్షలు (ఇంట్రడక్టరీ, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన ఈ కారుకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, అక్టోబర్ 11 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. టిగోర్‌తో పోలిస్తే అనేక మార్పులు చేసిన ఈ కారు ముందు భాగం టియాగో స్ఫూర్తితో, సైడ్ ప్రొఫైల్‌లో స్మూత్ కర్వ్స్‌తో సొగసుగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్స్, వాటిని అనుసంధానించే లైట్ స్ట్రిప్, మధ్యలో టాటా లోగో మరియు టెయిల్‌గేట్‌పై ప్రముఖంగా ‘Aeris’ లెటరింగ్‌ను అందించారు. ఈ కారు Dandeli Drizzle, Nitro Crimson, Dune Glow సహా 6 విభిన్న కలర్ ఆప్షన్లలో, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది.

Read Also : UPI Transaction Charges: రూ.2 వేలు దాటిన UPI పేమెంట్లపై ఛార్జీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

Tata Aeris Sedan
Tata Aries… New sedan launched with amazing features!

Tata Aeris Sedan: ప్రీమియం ఇంటీరియర్.. అత్యాధునిక టెక్నాలజీ

టాటా ఏరిస్ ఇంటీరియర్ కేబిన్ అత్యంత ప్రీమియంగా డిజైన్ చేయబడింది. కారు లోపల ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్రీ-ఫ్లోటింగ్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. దీని కింద ప్రాథమిక నియంత్రణల కోసం రోటరీ నాబ్‌లు, బటన్లు ఇచ్చారు. లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, Android Auto, Apple CarPlay, వెంటిలేటెడ్ సీట్లు మరియు డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు వంటి ఆధునిక ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.

తిరుగులేని భద్రత.. గట్టి పోటీ

భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే టాటా మోటార్స్ ఈ ఏరిస్ సెడాన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హై-బీమ్ అలర్ట్, ESP, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, రోల్‌ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా 360-డిగ్రీ కెమెరా సెటప్, ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ రికార్డర్‌ను కూడా అందించడం విశేషం. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన ఆదరణ ఉన్న మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి మోడళ్లకు టాటా ఏరిస్ గట్టి పోటీనివ్వనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యపూర్తి గుడ్డు vs గుడ్డు తెల్లసొన: ఏది మంచిది, ఏది తినాలి తెలుసుకుందాం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com