☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తల్లికి వందనం రెండో విడత నిధులపై బిగ్ అప్‌డేట్

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత నిధుల విడుదల కోసం ప్రభుత్వం కీలక చర్యలు...
తల్లికి వందనం రెండో విడత నిధులపై బిగ్ అప్‌డేట్

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత నిధుల విడుదల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొదటి విడతలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయగా, సాంకేతిక కారణాలు, నమోదు పెండింగ్, కొత్త చేరికల వల్ల నిధులు అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తుది జాబితాను సిద్ధం చేసింది.

Read Also : NTR Bharosa: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Thalliki Vandanam
Major update on the second phase of funds for ‘Thalliki Vandanam’

Thalliki Vandanam: కొత్తగా చేరిన విద్యార్థులు, పెండింగ్ లబ్ధిదారులకు లబ్ధి

ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చేరిన విద్యార్థులతో పాటు మొదటి విడతలో అర్హత ఉండి కూడా సాంకేతిక సమస్యల వల్ల నగదు అందని వారికి ఈ దఫాలో ప్రయోజనం చేకూరనుంది.

  • ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు.
  • జూలై 22న మొదటి విడత కింద 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో జమ చేసింది.
  • బడులు, కాలేజీల అడ్మిషన్లతో పాటు డేటా రికార్డులు సరిదిద్దిన వారు కలిపి మరో 2.7 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు రెండో విడత సాయం కోసం నిరీక్షిస్తున్నారు.

సచివాలయాల ద్వారా పరిశీలన.. ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం

మొదటి విడతలో డబ్బులు పడని వారి నుంచి ప్రభుత్వం అభ్యంతరాలు, వినతులను స్వీకరించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, క్షేత్రస్థాయి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి సచివాలయాల్లో జాబితాలను కూడా ప్రదర్శించారు.

ఆర్థిక శాఖ ఇటీవల ఈ రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి ఫైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తుది ఆమోదం కోసం ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే అధికారికంగా ముహూర్తం ఖరారు చేసి అర్హుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

పథకం మార్గదర్శకాల ప్రకారం, స్కూల్ మౌలిక వసతుల మినహాయింపులు పోను నికరంగా ఒక్కో అర్హులైన విద్యార్థికి రూ.13,000 చొప్పున వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ (DBT) ద్వారా జమ చేస్తారు. ఈ రెండో విడత పంపిణీ కూడా పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ ద్వారా ప్రయోజనం చేకూరినట్లవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడిని దోషులుగా తేల్చిన కోర్టుప్రజాసేవ పట్ల తపన ఉన్న యువతను సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకురండి: మోదీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com