☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బొత్స కుమార్తెపై టీడీపీ క్యాడర్ ఓవరాక్షన్..!

ఏపీలో మహిళల రక్షణ, వారికి ఇచ్చే గౌరవం గురించి కూటమి ప్రభుత్వం తరచూ పెద్ద పెద్ద మాటలు చెబుతుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు తెలుగుదేశం పార్టీ, కూటమి కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె, డాక్టర్ బొత్స అనూష భీమిలిలో పరిచయ సభ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమె పొలిటికల్ స్పీచ్‌ను […] The post బొత్స కుమార్తెపై టీడీపీ క్యాడర్ ఓవరాక్షన్..! appeared first on Telugu Rajyam.
బొత్స కుమార్తెపై టీడీపీ క్యాడర్ ఓవరాక్షన్..!

ఏపీలో మహిళల రక్షణ, వారికి ఇచ్చే గౌరవం గురించి కూటమి ప్రభుత్వం తరచూ పెద్ద పెద్ద మాటలు చెబుతుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు తెలుగుదేశం పార్టీ, కూటమి కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె, డాక్టర్ బొత్స అనూష భీమిలిలో పరిచయ సభ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమె పొలిటికల్ స్పీచ్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించడం పక్కన పెట్టి, సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమెను టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలతో ట్రోలింగ్స్‌కు దిగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

ఎన్నికల ప్రచారంలోనూ, నిత్యం ప్రెస్ మీట్లలోనూ మహిళలకు అత్యున్నత గౌరవం ఇస్తామని, ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదని కూటమి పెద్దలు ప్రకటిస్తుంటారు. కానీ, ఒక డాక్టర్ చదువుకుని రాజకీయాల్లోకి వచ్చి తన గళాన్ని వినిపిస్తున్న ఒక యువతిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దాడులు చేయడం, అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టడం ఏ రకమైన సంస్కృతి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉంటే విధానాల పరంగా తప్పుబట్టాలే తప్ప, ఒక మహిళా నాయకురాలిని ఈ స్థాయిలో కించపరచడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

గతంలో సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో వైసిపి కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు తమ సొంత పార్టీ కార్యకర్తలు ఒక మహిళా లీడర్‌ను ఇంత ఘోరంగా బూతులు తిడుతుంటే ఎందుకు మౌనంగా ఉందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు నిలదీస్తున్నారు. మహిళలపై ఆన్‌లైన్ వేధింపులను అరికట్టడానికి చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని, బొత్స అనూషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల కార్యకర్తలే ఇలాంటి నీచమైన సంస్కృతిని ప్రోత్సహిస్తే, ఇక సమాజంలో మహిళలకు భద్రత ఎక్కడుంటుందనే ప్రశ్నలు ఇప్పుడు పీక్స్‌కు చేరాయి.

The post బొత్స కుమార్తెపై టీడీపీ క్యాడర్ ఓవరాక్షన్..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← చంద్రబాబు, చినబాబు వార్నింగులన్నా డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే..!సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com