☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ పోలీస్, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన విజయవాడ గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టోడియల్ డెత్ కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి, పిటిషనర్‌కు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ […] The post సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..? appeared first on Telugu Rajyam.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ పోలీస్, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన విజయవాడ గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టోడియల్ డెత్ కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి, పిటిషనర్‌కు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు వ్యవహారంలో గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ పిల్ పై విచారణను ముందుకు తీసుకెళ్లాలంటే, సర్వోన్నత న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణను మే నెలలో పోలీసులు ఒక నాన్-బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూషన్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కస్టడీలోకి తీసుకున్నారు.

అయితే అతనిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా కొట్టడం వల్ల ఒక ప్రైవేట్ ఇంట్లో చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సాక్ష్యాలను నాశనం చేయడానికి అప్పటి సీఐ నాగరాజు మరియు కొందరు కానిస్టేబుళ్లు కలిసి సాయికృష్ణ బాడీని స్మశానవాటికలో రహస్యంగా అంత్యక్రియలు చేసేశారనే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించి సీనియర్ పోలీసు అధికారుల పాత్రపై విచారణ కోరారు.

పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆచూకీ లేకుండా పోవడం, చనిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “అసలు సాయికృష్ణను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు..? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యమైంది..?” అని ఏపీ పోలీసులను నిలదీసింది. ఈ కేసు విచారణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని చెబుతూ.. ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణపై గతంలో స్టే విధించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించింది. ఈ క్రమంలోనే, సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను బట్టి హైకోర్టులో ఉన్న పిటిషన్లపై ఎలా ముందుకెళ్లాలనే లీగల్ అంశాలను పరిశీలించడానికి నేడు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలను డిమాండ్ చేసింది.

The post సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బొత్స కుమార్తెపై టీడీపీ క్యాడర్ ఓవరాక్షన్..!ఉత్తరాంధ్రలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ సభ..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com