☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఉత్తరాంధ్రలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ సభ..?

విజయనగరం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీలో చేరడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలకు దారి తీస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పట్టు, కేడర్‌ బలంతో విజయనగరంలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ చేరికల ఊపును తక్షణమే అడ్డుకోవడానికి, కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే విశాఖపట్నంలో ఈ నెల 16న ప్రతిష్టాత్మకంగా […] The post ఉత్తరాంధ్రలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ సభ..? appeared first on Telugu Rajyam.
ఉత్తరాంధ్రలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ సభ..?

విజయనగరం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీలో చేరడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలకు దారి తీస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పట్టు, కేడర్‌ బలంతో విజయనగరంలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ చేరికల ఊపును తక్షణమే అడ్డుకోవడానికి, కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇందులో భాగంగానే విశాఖపట్నంలో ఈ నెల 16న ప్రతిష్టాత్మకంగా ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమైంది. ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఉన్న బీసీ వర్గాలను తిరిగి తమవైపు తిప్పుకోవడమే కాకుండా, చిన్న శ్రీను ఎఫెక్ట్‌తో జరుగుతున్న డ్యామేజ్‌ను తగ్గించుకోవడమే ఈ సభ ముఖ్యాంశంగా కనిపిస్తోంది. ఈ వేదిక ద్వారా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచడంతో పాటు, ప్రధానంగా రెండు కీలక అంశాలపై చర్చించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం బీసీ వర్గాలను మోసం చేస్తోందని ఎండగట్టడంతో పాటు, ఇటీవల బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ వేధింపులు, భౌతిక దాడులపై ఈ వేదిక నుంచి గళమెత్తనున్నారు. తద్వారా బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడం ద్వారా ఉత్తరాంధ్రలో మరింత మంది నేతలు, కార్యకర్తలు పార్టీ మారకుండా చెక్ పెట్టడమే వైఎస్సార్‌సీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

The post ఉత్తరాంధ్రలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ సభ..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏం జరుగుతోంది..?జ్ఞానేశ్ ను కాపాడాలా, వదలాలా..? మోడీషాకు చుక్కలు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com