☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త..

Ration Card : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో సబ్సిడీపై నిత్యావసర వస్తువులనుసైతం సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త..

Ration Card : ఎల్‌నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. ఈ వానాకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో వరి పంట సాగు తగ్గింది. రబీలోనూ వరి పంట సాగుచేయొద్దని ప్రభుత్వం చెబుతుంది. దీంతో సన్నబియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గతంలో క్వింటా సన్నబియ్యం ధర రూ.8వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 9వేలు దాటింది. దీంతో 26 కిలోల బస్తా ధర ఇప్పుడు రూ.2300 వరకు చేరుకుంది. కిలో బియ్యం రూ. 70 నుంచి రూ. 90 వరకు విక్రయిస్తున్నారు.

Also Read : Gold-Silver Prices Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 1.05 కోట్ల కుటుంబాలు రేషన్ కార్డు కలిగి ఉన్నాయి. దీంతో ప్రతీనెలా 3.20కోట్ల మందికి 2.16 లక్షల టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. దీంతో సన్నం బియ్యం ధరలు పెరిగినప్పటికీ.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కాస్త ఊరట లభిస్తుంది. సన్నంబియ్యం ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ నిత్యావసర వస్తువుల సరుకులను కూడా రాయితీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో సన్నబియ్యం, ఉల్లిగడ్డలను ధరలు తగ్గించి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ కార్డు ఉన్నవారికి రైతు మార్కెట్లలో అందిస్తున్నారు. కందిపప్పు, పామాయిల్, ఇతర నిత్యావసర వస్తువులను సైతం రాయితీపై అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సైతం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమలు, పామాయిల్, చెక్కెర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు వంటి కిరాణా సరుకులను సబ్సిడీ ధరలపై అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సబ్సిడీపై నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సబ్సిడీపై నిత్యావసర వస్తువులను అందించేలా దృష్టిసారించాలని.. అందుకోసం తమకు నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా!అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com