Rain Alert : రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు (ఆదివారం) మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రముఖ తెలంగాణ వెదర్మ్యాన్ (Telangana Weatherman) అంచనా వేశారు. ముఖ్యంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ మరియు నారాయణపేట జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు, ప్రజలు తగిన అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : తెలంగాణ లో ముగింపు ఘట్టానికి చేరుకున్న బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. వెదర్మ్యాన్ హెచ్చరిక!
భారీ వర్షాలు పడే జిల్లాలతో పాటు వికారాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగామ, హనుమకొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేయబడింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో (HYD) కూడా నేడు మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై, నగరంలోని పలు ప్రాంతాలలో వానలు పడే ఆస్కారమున్నట్లు వెదర్మ్యాన్ వెల్లడించారు. అకస్మాత్తుగా కురిసే ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






