☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

TG TMARS: ఈ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే.. తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గిచండంతో పాటు వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డుభద్రతకు కోసం ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులతో ఈ బ్యూరోను రన్ చేయనుంది.
TG TMARS: ఈ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే.. తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా ట్రాఫిక్, రోడ్, రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగానికి టీజీ టీఎంఏఆర్ఎస్ (TG TMARS)గా నామకరణం చేసింది. ఈ బ్యూరోకు డైరెక్టర్‌గా ఏడీజీపీ (ADGP) లేదా ఐజీ (IG) స్థాయి అధికారి వ్యవహరించనున్నట్టు పేర్కొంది.

ఈ ప్రత్యేక బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పై నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుంది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటిపై శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలైన డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్ వంటి వాటిపై ఈ విభాగం కట్టుదిట్టమైన నిఘా ఉంచుతుంది.

కొత్త బ్యూరో కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక అదనపు ఎస్పీ స్థాయి ట్రాఫిక్ పోస్టును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ విభాగంలోని 300 పోస్టులను ఈ నూతన బ్యూరోకు బదిలీ చేయనున్నారు. విధుల్లో పారదర్శకత కోసం ట్రాఫిక్ సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలను అందజేయనున్నారు. అలాగే, సిబ్బందికి మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ట్రంప్ బొమ్మతో వన్ డాలర్ కాయిన్.. చట్టబద్ధమేనా?విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com