☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

వ‌రిసాగు వాయిదా వేసుకోండి: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర నీరు, విద్యుత్‌ కొరత ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు చేజారిపోయే దశకు చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎనిమిది నెలలు రాష్ట్రానికి అత్యంత కీలకమని తెలిపారు. ప్రజలు, రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గతేడాది […] The post వ‌రిసాగు వాయిదా వేసుకోండి: రేవంత్‌ రెడ్డి appeared first on Adya News Telugu.
వ‌రిసాగు వాయిదా వేసుకోండి: రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర నీరు, విద్యుత్‌ కొరత ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు చేజారిపోయే దశకు చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎనిమిది నెలలు రాష్ట్రానికి అత్యంత కీలకమని తెలిపారు. ప్రజలు, రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 400 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉండేది. అయితే వర్షాలు లేక ఈ ఏడాది కేవలం 209 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాల కోసమే అత్యంత పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రైతులు పెద్దమనసుతో ఆలోచించి ఈ ఒక్క యాసంగి సీజన్‌లో వరి సాగును వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులుగా కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో కరెంట్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. సాధారణ సగటు వినియోగం కంటే అదనంగా 5,000 మెగావాట్ల విద్యుత్ వాడకం పెరిగింది. అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో డిమాండ్ రావడం రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి. ఏ ధరకు దొరికినా సరే మార్కెట్ నుంచి అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి అవసరమైన అదనపు విద్యుత్‌ను వెంటనే కేటాయించి ఆదుకోవాలని కేంద్రాన్ని సీఎం కోరారు. ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర-రాష్ట్ర పథకాల్లో కేంద్రం తన నిధుల వాటాను పెంచి రాష్ట్రాలకు తోడ్పాటు అందించాలని కోరారు.

The post వ‌రిసాగు వాయిదా వేసుకోండి: రేవంత్‌ రెడ్డి appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి..న్యూజిలాండ్‌తో సిరీస్.. బుమ్రాకు రెస్ట్.. కారణమిదేనా! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com