☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి..

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్యే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మరికల్ మండలంలోని మాద్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి రాములమ్మ, బాలస్వామి దంపతులు. వీరి వివాహం జరిగి దాదాపు 28 ఏళ్లు పూర్తయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా బాలస్వామి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పలుమార్లు […] The post వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి.. appeared first on Adya News Telugu.
వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి..

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్యే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మరికల్ మండలంలోని మాద్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి రాములమ్మ, బాలస్వామి దంపతులు. వీరి వివాహం జరిగి దాదాపు 28 ఏళ్లు పూర్తయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

కొంతకాలంగా బాలస్వామి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పలుమార్లు హెచ్చరించినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములమ్మ ఎలాగైనా భర్తను అంతమొందించాలని పథకం వేసింది.

గత నెల 24వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆమె ఘాతుకానికి పాల్పడింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఇంట్లో నిల్వ ఉంచిన పెట్రోల్‌ను తీసుకొచ్చింది. మంచంపై గాఢ నిద్రలో ఉన్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలతో హాహాకారాలు చేసిన బాలస్వామిని స్థానికులు హుటాహుటిన మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు రాములమ్మపై బలమైన అనుమానాలు రేకెత్తించాయి. పోలీసులు తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. తానే స్వయంగా భర్తపై పెట్రోల్ పోసి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి.. appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్!వ‌రిసాగు వాయిదా వేసుకోండి: రేవంత్‌ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com