☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్!

ఇరాన్‌ సైనిక, ఇంధన మౌలిక వసతులపై దాడి చేసేందుకు అమెరికా అత్యవసర ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని శక్తిమంతమైన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB – GBU-43/B)ను ప్రయోగించే ఆలోచన చేస్తోంది. 11 టన్నుల బరువుండే ఈ బాంబు అమెరికా వద్ద ఉన్న అతిపెద్ద అణ్వస్త్రేతర ఆయుధం. 2003లో అభివృద్ధి చేసిన ఈ బాంబును 2017లో అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ గుహలపై తొలిసారిగా ప్రయోగించారు. ఈ బాంబు నేలను తాకకుండా గాల్లోనే 1.8 మీటర్ల […] The post ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్! appeared first on Adya News Telugu.
ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్!

ఇరాన్‌ సైనిక, ఇంధన మౌలిక వసతులపై దాడి చేసేందుకు అమెరికా అత్యవసర ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని శక్తిమంతమైన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB – GBU-43/B)ను ప్రయోగించే ఆలోచన చేస్తోంది. 11 టన్నుల బరువుండే ఈ బాంబు అమెరికా వద్ద ఉన్న అతిపెద్ద అణ్వస్త్రేతర ఆయుధం. 2003లో అభివృద్ధి చేసిన ఈ బాంబును 2017లో అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ గుహలపై తొలిసారిగా ప్రయోగించారు.

ఈ బాంబు నేలను తాకకుండా గాల్లోనే 1.8 మీటర్ల ఎత్తులో పేలిపోతుంది. దీనివల్ల 1.6 కిలోమీటర్ల పరిధిలోని భవనాలు, రాడార్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. ఈ విస్ఫోటం వల్ల పరిసరాల్లోని ఆక్సిజన్ మొత్తం ఒక్కసారిగా కాలిపోతుంది. ఫలితంగా అక్కడ శూన్యం ఏర్పడి తీవ్ర ప్రకంపనలు వస్తాయి. దీనివల్ల భూగర్భ సొరంగ మార్గాలు కుప్పకూలిపోతాయి. లోపల ఉండే శత్రువుల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఉపరితలంపై ఉండే రక్షణ స్థావరాలను నాశనం చేయడానికి ఇది సరైన అస్త్రం.

అయితే ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం ఎంవోఏబీకి సాధ్యం కాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌కు చెందిన ఫోర్దో అణు శుద్ధి కర్మాగారం 200 నుంచి 300 అడుగుల లోతున కఠిన గ్రానైట్, రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటు కింద ఉంది. పలుచటి అల్యూమినియం తొడుగు ఉండే ఎంవోఏబీ గాల్లో పేలేందుకు మాత్రమే అనుకూలం. ఇది రాతిని చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లలేదు. పైగా ఈ బాంబును వేగం తక్కువగా ఉండే ఎంసీ-130 రవాణా విమానం ద్వారానే జారవిడవాలి. ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలున్న ఇరాన్‌పైకి ఇలాంటి విమానం వెళ్లడం ప్రమాదకరం.

ఇలాంటి లోతైన అణు స్థావరాలను నాశనం చేయడానికి జీబీయూ-57 (ఎంవోపీ) బాంబు మాత్రమే సరిపోతుంది. 13 టన్నుల బరువుండే ఈ పెనెట్రేటర్ బాంబు 60 అడుగుల మందపాటి కాంక్రీటును కూడా చీల్చగలదు. దీన్ని రక్షణ వ్యవస్థలను తప్పించుకోగల బి-2బి స్టెల్త్ బాంబర్ల ద్వారా ప్రయోగించవచ్చు. చమురు కేంద్రాలు, విద్యుత్ గ్రిడ్ల ధ్వంసానికి ఎంవోఏబీ సరిపోయినా, భూగర్భ అణు కేంద్రాలకు మాత్రం ఎంవోపీ బాంబే మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

The post ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG
← 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు వైకాపా తొలి జాబితా!వివాహేతర సంబంధం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com