☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు వైకాపా తొలి జాబితా!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు మేయర్ అభ్యర్థులు, 20 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రధాన నగరాల పేర్లపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ, […] The post 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు వైకాపా తొలి జాబితా! appeared first on Adya News Telugu.
7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు వైకాపా తొలి జాబితా!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు మేయర్ అభ్యర్థులు, 20 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసింది.

రాష్ట్రంలో మొత్తం 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు ప్రధాన నగరాల పేర్లపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఈ ఆరింటిని మినహాయించి, మిగిలిన ఏడు కార్పొరేషన్లకు పార్టీ అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది.

పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో కీలక పేర్లపై దాదాపు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ మేయర్ స్థానానికి తాజా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేరును పరిశీలిస్తున్నారు. తిరుపతి మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ డాక్టర్ శిరీష పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు మేయర్‌గా మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ భార్య సుశీల పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పెడన మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా కటకం నాగకుమారి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

మిగిలిన ఆరు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల జాబితాను పార్టీ శుక్రవారం విడుదల చేయనుంది. వీటితో పాటు మిగిలిన మున్సిపాలిటీల ఛైర్మన్ల పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రకటనతో వైకాపా శ్రేణులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

The post 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు వైకాపా తొలి జాబితా! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← భారత్ వర్సెస్ లంక మ్యాచ్‌ వేదిక మారుతోందా..?ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com