☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Petal Gehlot: ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే .. ప‌ర్య‌వ‌సానాలు త‌ప్ప‌వు: పాక్‌కు ఇండియా కౌంట‌ర్

Petal Gehlot: ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే, ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఇండియా హెచ్చ‌రించింది. ఇస్లామాబాద్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు భార‌త్ పేర్కొన్న‌ది. యూఎన్‌లోని భార‌త ప్ర‌తినిధి పీత‌ల్ గెహ్లాట్ మాట్లాడుతూ సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పాకిస్థాన్ ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆరోపించారు.
Petal Gehlot: ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే .. ప‌ర్య‌వ‌సానాలు త‌ప్ప‌వు: పాక్‌కు ఇండియా కౌంట‌ర్

న్యూఢిల్లీ: ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ సాక్షిగా పాకిస్థాన్‌కు కౌంట‌ర్ ఇచ్చింది ఇండియా. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే, ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఇండియా హెచ్చ‌రించింది. ఇస్లామాబాద్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు భార‌త్ పేర్కొన్న‌ది. పాక్ ప్ర‌ధాని షెహ‌బాద్ ష‌రీఫ్ చేసిన ప్ర‌సంగానికి కౌంట‌ర్‌గా ఇండియా ఈ వ్యాఖ్య‌లు చేసింది. యూఎన్‌లోని భార‌త ప్ర‌తినిధి పీత‌ల్ గెహ్లాట్(Petal Gehlot) మాట్లాడుతూ సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పాకిస్థాన్ ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆరోపించారు. అలాంటి చ‌ర్య‌లు చేప‌డితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని ఆమె హెచ్చ‌రించారు. భార‌త్‌తో పాటు జ‌మ్మూక‌శ్మీర్‌పై పాక్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె తీవ్రంగా ఖండించారు.

ఉగ్ర‌వాదం, ప్ర‌జాస్వామ్య హ‌క్కులు, మైనార్టీల‌ను ఆద‌రిస్తున్న తీరుపై పాక్ వైఖ‌రిని భార‌త్ ఖండించింది. పాక్ చేప‌డుతున్న సీమాంత‌ర ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు గ‌త ఏడాది గ‌ట్టి జ‌వాబు ఇచ్చామ‌ని, ఉగ్ర‌వాదులు ఎక్క‌డికీ పారిపోలేర‌ని, వాళ్లు దాచుకునే ప్ర‌దేశం లేద‌ని, స్వీయ‌ర‌క్ష‌ణ హ‌క్కును వినియోగిస్తూ, ఉగ్ర‌వాదాన్ని త‌రిమేందుకు తాము వెనుకాడ‌బోమ‌ని ఆమె అన్నారు. పాకిస్తాన్ చేప‌డుతున్న ఉగ్ర చ‌ర్య‌ల‌కు ప‌రిణామాలు ఉంటాయ‌న్నారు. ఉగ్ర‌వాదం ప‌ట్ల పాక్ వైఖ‌రి.. ఆ దేశానికి కానీ, ప్ర‌పంచానికి కానీ మేలు చేయ‌ద‌ని పీత‌ల్ గెహ్లాట్ అన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సంప్రదాయ లుక్‌లో నిక్కీ తంబోలి.. గ్రీన్ డ్రెస్‌లో మెరిసిన అందం!Kaaka | చిరు లీక్స్.. ‘కాకా’ మూవీ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com