☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

చంద్రబాబు ఆదేశాలకే దిక్కులేదా కొలికపూడి..?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ముగుస్తున్న తరుణంలో అధికార కూటమిలో సీట్ల పంపకాల చిచ్చు ఒక్కసారిగా బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య టికెట్ల కేటాయింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మిత్రధర్మంలో భాగంగా తిరువూరు చైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగరవేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో […] The post చంద్రబాబు ఆదేశాలకే దిక్కులేదా కొలికపూడి..? appeared first on Telugu Rajyam.
చంద్రబాబు ఆదేశాలకే దిక్కులేదా కొలికపూడి..?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ముగుస్తున్న తరుణంలో అధికార కూటమిలో సీట్ల పంపకాల చిచ్చు ఒక్కసారిగా బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య టికెట్ల కేటాయింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మిత్రధర్మంలో భాగంగా తిరువూరు చైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగరవేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీ అధినేత ఆదేశాలనే ధిక్కరిస్తూ కొలికపూడి తన సొంత అభ్యర్థిని బరిలోకి దించుతుండటంతో, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో టీడీపీ లీడర్‌షిప్ విఫలమైందా అనే చర్చ జోరందుకుంది. ఈ అంతర్గత పోరులో భాగంగా, జనసేనకు కేటాయించిన సీటును దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని పక్కనబెట్టి, తన వర్గానికి చెందిన అభ్యర్థి పెనుబల్లి శ్రావణిని టీడీపీ తరఫున తిరువూరు చైర్మన్ అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ వేయించడానికి రంగం సిద్ధం చేశారు.

ఈ మేరకు నామినేషన్ ర్యాలీకి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన అధికారిక పోస్ట్ ఇప్పుడు కూటమి శ్రేణులను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే కొలికపూడి శ్రీనివాసరావు దూకుడు రాజకీయాలు చేస్తుండటం, స్థానిక జనసేన నేతలతో ఆయనకు సఖ్యత లేకపోవడం ఈ తాజా వివాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు నేరుగా చంద్రబాబు సీట్ల సర్దుబాటు నిర్ణయాన్నే సవాల్ చేస్తూ సొంత నామినేషన్లకు పిలుపునివ్వడం, తిరువూరులో జనసేన క్యాడర్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

రేపు నామినేషన్ల గడువు ముగియనుండటంతో, తిరువూరులో కొలికపూడి వర్గం నామినేషన్ వేస్తే గనుక పొత్తు బంధం దెబ్బతినే ప్రమాదం ఉందని అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. మరి కొద్ది గంటల్లోనే చంద్రబాబు లేదా లోకేష్ రంగంలోకి దిగి కొలికపూడిని లైన్‌లోకి తెస్తారా, లేక తిరువూరులో కూటమి మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

The post చంద్రబాబు ఆదేశాలకే దిక్కులేదా కొలికపూడి..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పల్నాడులో కొత్త రచ్చ.. ఎలక్షన్ టైంలో ఎందుకీ గేమ్..?అసలు కడపలో ఏం జరుగుతోంది..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com