☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

అసలు కడపలో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ జిల్లా మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. అయితే, ఈసారి కనిపిస్తున్న పొలిటికల్ ట్రెండ్ గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాత్మక పంథాలో సాగుతోంది. ఒకప్పుడు పల్లెల్లో నేరుగా బాంబులు, కత్తులతో నడిచిన ఫ్యాక్షన్ రాజకీయం.. ఇప్పుడు ‘పోలీస్ నోటీసులు’, ‘టైమింగ్ గేమ్స్’ మరియు ‘అధికారిక ఆంక్షల’ చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ […] The post అసలు కడపలో ఏం జరుగుతోంది..? appeared first on Telugu Rajyam.
అసలు కడపలో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ జిల్లా మరోసారి రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. అయితే, ఈసారి కనిపిస్తున్న పొలిటికల్ ట్రెండ్ గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాత్మక పంథాలో సాగుతోంది. ఒకప్పుడు పల్లెల్లో నేరుగా బాంబులు, కత్తులతో నడిచిన ఫ్యాక్షన్ రాజకీయం.. ఇప్పుడు ‘పోలీస్ నోటీసులు’, ‘టైమింగ్ గేమ్స్’ మరియు ‘అధికారిక ఆంక్షల’ చుట్టూ తిరుగుతుండటం గమనార్హం.

పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ అభ్యర్థిని బండి దీప్తి రెడ్డిలకు పోలీసులు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక కేవలం శాంతిభద్రతల నిర్వహణ మాత్రమే లేదు, దీని వెనుక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష శ్రేణులు రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తూ, నామినేషన్ ప్రక్రియను వన్-సైడ్ చేయడమే లక్ష్యంగా అధికారిక యంత్రాంగం కదులుతోందనే వాదనలకు ఈ నోటీసుల పర్వం మరింత బలం చేకూరుస్తోంది.

ఈ వ్యూహాత్మక అణచివేతలో భాగంగానే నామినేషన్ల స్లాట్ టైమింగ్స్‌లో సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులను నామినేషన్ల కోసం మధ్యాహ్నం 1:30 గంటలకు రమ్మని పిలిపించి, తీరా అక్కడికి చేరుకున్నాక ‘ఈరోజు వద్దు.. రేపు రండి’ అంటూ వెనక్కి పంపడం వెనుక పెద్ద స్కెచ్ ఉందనే చర్చ నడుస్తోంది. ఇది కేవలం సాంకేతిక ఆలస్యం కాదు, ప్రతిపక్షంలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక మానసిక వ్యూహం.

ఇక్కడ అత్యంత విస్మయకరమైన విషయం ఏంటంటే, ఒకవైపు ప్రతిపక్ష నేతలకు ర్యాలీలు వద్దంటూ పోలీసులు నిబంధనల బుక్ చూపిస్తుంటే.. అదే సమయంలో నామినేషన్ కేంద్రాల వద్ద వందలాది మంది అధికార పార్టీ ముఠాలు బహిరంగంగానే తిరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే, ఈ ముఠాల చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లు, వేటకొడవళ్లు వంటి ప్రమాదకరమైన ఆయుధాలు స్పష్టంగా కనిపిస్తున్నా నిఘా వర్గాలు కానీ, క్షేత్రస్థాయి పోలీసులు కానీ స్పందించకపోవడం గమనార్హం.

రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేస్తున్నా, వారించాల్సిన వ్యవస్థ మౌనప్రేక్షకుడిగా మిగిలిపోవడం ఏపీ ఎన్నికల చరిత్రలోనే అత్యంత బలహీనమైన ఉదంతంగా నిలిచిపోనుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒకప్పుడు తామే ‘ప్రజాస్వామ్య పరిరక్షకులం’ అని గొంతు చించుకున్న తెలుగుదేశం పార్టీ, నేడు పవర్ లోకి రాగానే అదే ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కడం ఒక పెద్ద రాజకీయ వైరుధ్యం.

The post అసలు కడపలో ఏం జరుగుతోంది..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← చంద్రబాబు ఆదేశాలకే దిక్కులేదా కొలికపూడి..?సీమలో రచ్చ రచ్చ.. రంగంలోకి జగన్..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com