☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కేంద్రమంత్రి గారే అధిష్టానం, అంతా పెమ్మసాని రాజ్యం..!

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రాధాన్యతలపై పెద్ద చర్చ సాగుతోంది. అయితే, ప్రస్తుతం గుంటూరు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మేయర్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, […] The post కేంద్రమంత్రి గారే అధిష్టానం, అంతా పెమ్మసాని రాజ్యం..! appeared first on Telugu Rajyam.
కేంద్రమంత్రి గారే అధిష్టానం, అంతా పెమ్మసాని రాజ్యం..!

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ప్రాధాన్యతలపై పెద్ద చర్చ సాగుతోంది. అయితే, ప్రస్తుతం గుంటూరు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మేయర్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ నేతల అభిప్రాయాలకు అసలు ప్రాధాన్యత దక్కడం లేదనే గట్టి ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో వినపడుతోంది.

కూటమి పార్టీల నేతలను పక్కన పెట్టడమే కాకుండా, స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఆశావహుల విజ్ఞప్తులను కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. గుంటూరు మేయర్ ఎన్నికల వ్యవహారం మొత్తం ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ కనుసన్నల్లోనే జరుగుతోందనే లీకులు అందుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్న కీలక ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించకుండా, కేవలం కేంద్ర మంత్రి మార్క్ నిర్ణయాలే ఇక్కడ అమలవుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ ఏకపక్ష ధోరణి, మారుతున్న సమీకరణాలు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో తాము గ్రౌండ్ లెవెల్‌లో పని చేస్తుంటే.. మేయర్ పదవి మాత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా సెలెక్ట్ చేసిన వాళ్లకే దక్కుతుందనే వార్తలతో ప్రజాప్రతినిధులలో కోపం రోజురోజుకూ పెరిగిపోతోంది. తమ సొంత నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేషన్ స్థానంలో తమకు కనీస ప్రాధాన్యత లేదా మాట చెల్లకుండా పోతోందని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంతర్గత అసంతృప్తి రాబోయే రోజుల్లో కూటమిలో ఎలాంటి పొలిటికల్ ఫైర్‌కు దారితీస్తుందో చూడాలి.

The post కేంద్రమంత్రి గారే అధిష్టానం, అంతా పెమ్మసాని రాజ్యం..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← దారిలోకి వచ్చిన డిప్యూటి సీఎం..?కూటమి తమ్ముళ్లలో బీపీ పెరుగుతోందా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com