☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కూటమి తమ్ముళ్లలో బీపీ పెరుగుతోందా..?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా, అరాచక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడంపై తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయం ముందే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడటంపై తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నా కూడా కళ్ల ముందే దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం […] The post కూటమి తమ్ముళ్లలో బీపీ పెరుగుతోందా..? appeared first on Telugu Rajyam.
కూటమి తమ్ముళ్లలో బీపీ పెరుగుతోందా..?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా, అరాచక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడంపై తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయం ముందే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడటంపై తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నా కూడా కళ్ల ముందే దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం కేవలం “చర్యలు తీసుకుంటాం, సీసీ ఫుటేజ్ చూసి గుర్తిస్తాం” అంటూ ప్రకటనలకే పరిమితం కావడంపై కార్యకర్తలు అంతర్గతంగా తీవ్రంగా చర్చించుకుంటూ తిట్టుకుంటున్నారు. చట్టం, పోలీసులు అంటే అరాచక మూకలకు ఇంకా భయం ఎందుకు కలగడం లేదని, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై దాడులు జరిగితే ఓపిక పట్టామని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇంకా ఎంతకాలం సహనంతో ఉంటామని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సాగతీత ధోరణి వల్ల కేడర్‌లో నైరశ్యం అలుముకుంటోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

దాడికి పాల్పడిన రౌడీషీటర్లపై కేవలం క్రిమినల్ కేసులు నమోదు చేసి సరిపెట్టకుండా, తక్షణమే వారిని అరెస్ట్ చేసి లోపల వేయాలని కూటమి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మరియు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే అరాచక శక్తులకు భయం పుడుతుందని, లేదంటే క్షేత్రస్థాయిలో తమ రక్తం మరిగిపోతోందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. తూతూమంత్రం హెచ్చరికలు పక్కనబెట్టి, ఉపాధ్యాయులపై చేయి చేసుకున్న ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపాలని కేడర్ సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి తెస్తోంది.

The post కూటమి తమ్ముళ్లలో బీపీ పెరుగుతోందా..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కేంద్రమంత్రి గారే అధిష్టానం, అంతా పెమ్మసాని రాజ్యం..!బెజవాడలో వైసీపీ తప్పు చేసిందా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com