☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అమరావతిలో కేబినెట్ మీటింగ్‌ల జాతర..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ అమరావతి వేదికగా కేబినెట్ హడావుడి మొదలైంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం భేటీ కాబోతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కీలక అంశాన్ని తెరపైకి తెస్తూ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 29న జరగబోయే భేటీలో కూడా పలు కీలకమైన పారిశ్రామిక విధానాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించి కొన్ని […] The post అమరావతిలో కేబినెట్ మీటింగ్‌ల జాతర..! appeared first on Telugu Rajyam.
అమరావతిలో కేబినెట్ మీటింగ్‌ల జాతర..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ అమరావతి వేదికగా కేబినెట్ హడావుడి మొదలైంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం భేటీ కాబోతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కీలక అంశాన్ని తెరపైకి తెస్తూ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 29న జరగబోయే భేటీలో కూడా పలు కీలకమైన పారిశ్రామిక విధానాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఇప్పుడు ఒక సరికొత్త చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే కేబినెట్ సమావేశాల సంఖ్య చాలా ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలకోసారి లేదా అవసరాన్ని బట్టి రెండు నెలలకోసారి జరగాల్సిన మంత్రివర్గ సమావేశాలు.. ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయి. ప్రతి మీటింగ్‌లోనూ పదుల సంఖ్యలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు, వందల జీవోలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ నిర్ణయాల అమలు ఎంతవరకు సాగుతోందనేదే అసలైన ప్రశ్న.

కేబినెట్ భేటీలు జరపడం, ఆ తర్వాత సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు పెట్టి హామీలు గుప్పించడం వరకే పరిమితం అవుతున్నారే తప్ప, వాటి వల్ల సామాన్య ప్రజలకు అందుతున్న తక్షణ ఉపశమనం ఏంటనే కోణంలో లైట్‌గా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీనియార్టీకి, ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్స్‌కు కేబినెట్ మీటింగ్‌లు నిర్వహించడం ఒక లెక్క కాదు. కాకపోతే, కేవలం మీటింగ్‌లకే పరిమితం కాకుండా.. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు గ్రౌండ్ లెవెల్‌కు వెళ్లాయో సమీక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది.

ఒకవైపు సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యం జరుగుతోందనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతున్న తరుణంలో.. మళ్లీ ఇంకో కేబినెట్ మీటింగ్ పెట్టి కొత్త నిర్ణయాలు ప్రకటించడం వల్ల పొలిటికల్ మైలేజ్ రావచ్చు కానీ, గ్రౌండ్ రియాలిటీ మారదు. కాబట్టి, ఈ నెల 29న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా కేవలం కొత్త ప్లాన్లు వేయడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పాత వాగ్దానాల అమలుకు పక్కా టైమ్ లైన్ ప్రకటిస్తేనే ఈ మీటింగ్‌లకు ఒక అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

The post అమరావతిలో కేబినెట్ మీటింగ్‌ల జాతర..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గౌతమ్ గంభీర్‌కు రాజ్యసభ సీటు ఆఫర్..? హెడ్ కోచ్ పదవికి రాజీనామా..!చంద్రబాబు, చినబాబు వార్నింగులన్నా డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com