☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఒకవైపు లాఠీలు, అరెస్టులు.. మరోవైపు కంటితుడుపు పదోన్నతుల జీవోలా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న పోరాటం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఉద్యమాలను తలపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద హెచ్చరికలు జారీ చేసినా వెనక్కి తగ్గని వేలాది మంది సచివాలయ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌కు పోటెత్తారు. అయితే, ఒకవైపు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి రక్తం చిందిస్తుంటే, ప్రభుత్వం కేవలం కొన్ని వందల పోస్టుల పదోన్నతులతో […] The post ఒకవైపు లాఠీలు, అరెస్టులు.. మరోవైపు కంటితుడుపు పదోన్నతుల జీవోలా..? appeared first on Telugu Rajyam.
ఒకవైపు లాఠీలు, అరెస్టులు.. మరోవైపు కంటితుడుపు పదోన్నతుల జీవోలా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న పోరాటం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఉద్యమాలను తలపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద హెచ్చరికలు జారీ చేసినా వెనక్కి తగ్గని వేలాది మంది సచివాలయ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌కు పోటెత్తారు. అయితే, ఒకవైపు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి రక్తం చిందిస్తుంటే, ప్రభుత్వం కేవలం కొన్ని వందల పోస్టుల పదోన్నతులతో కంటితుడుపు చర్యలకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తమ దీర్ఘకాలిక డిమాండ్లు అయిన రెండు నోషనల్ ఇన్‌క్రిమెంట్లు, బకాయి వేతనాల విడుదల, ప్రమోషన్ల కోసం శాశ్వత ముసాయిదా వంటి డిమాండ్లతో ఉద్యోగులు పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ ఆదివారం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఉద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ, వందలాది మంది ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అలంకార్ కూడలి వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలో ఎక్కించడం, అడ్డుకున్న వారిపై లాఠీ ఛార్జ్ చేయడం విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

సరిగ్గా ఉద్యోగులు పెద్ద ఎత్తున ‘చలో విజయవాడ’కు సిద్ధమవుతున్న తరుణంలోనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పన, కొన్ని పోస్టుల అప్‌గ్రేడేషన్ అంటూ పురపాలక శాఖ జీవో విడుదల చేసింది. లక్షలాది మంది సచివాలయ ఉద్యోగులు రోడ్లపైకి వస్తుంటే, కేవలం 815 మందికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఈ అరకొర ప్రమోషన్ల ఉత్తర్వులు ఇవ్వడం కేవలం వారి ఆందోళనలను నీరుగార్చే “కంటితుడుపు చర్య” మాత్రమేనని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

పెండింగ్‌లో ఉన్న 9 నెలల ప్రొబేషన్ బకాయి జీతాలు, ప్రతి ఏటా అందాల్సిన యాన్యువల్ ఇన్‌క్రిమెంట్లు, సర్వీస్ నిబంధనల వంటి ప్రధాన సమస్యలను పక్కనబెట్టి, ఇలాంటి తాత్కాలిక తాయిలాలతో ఉద్యోగులను శాంతింపజేయాలని చూడటం ప్రభుత్వ భ్రమ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. తమకు లాఠీ దెబ్బలు కాదని, లిఖితపూర్వకమైన పూర్తి హామీలు లభించే వరకు సమరశంఖం ఆపేది లేదని విజయవాడ వేదికగా సచివాలయ శ్రేణులు తేల్చిచెప్పాయి.

The post ఒకవైపు లాఠీలు, అరెస్టులు.. మరోవైపు కంటితుడుపు పదోన్నతుల జీవోలా..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← చిన్న శ్రీను జగన్ సమస్య తీర్చాడా..?తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖ‌రారు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com