☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

చిన్న శ్రీను జగన్ సమస్య తీర్చాడా..?

విజయనగరం జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో బొత్స సత్యనారాయణకు ఎదురుండేది కాదు. కానీ, ఆయన రాజకీయ వారసుడిగా, జిల్లా జడ్పీ చైర్మన్‌గా చక్రం తిప్పిన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ ఒక్క పరిణామం బొత్సను సొంత నియోజకవర్గంలోనే అత్యంత బలహీనపరిచిందా..? ఇప్పుడు ఆయనకు వైసీపీలోనే కంటిన్యూ అవ్వడం […] The post చిన్న శ్రీను జగన్ సమస్య తీర్చాడా..? appeared first on Telugu Rajyam.
చిన్న శ్రీను జగన్ సమస్య తీర్చాడా..?

విజయనగరం జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో బొత్స సత్యనారాయణకు ఎదురుండేది కాదు. కానీ, ఆయన రాజకీయ వారసుడిగా, జిల్లా జడ్పీ చైర్మన్‌గా చక్రం తిప్పిన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ ఒక్క పరిణామం బొత్సను సొంత నియోజకవర్గంలోనే అత్యంత బలహీనపరిచిందా..? ఇప్పుడు ఆయనకు వైసీపీలోనే కంటిన్యూ అవ్వడం తప్ప వేరే దారి లేదా..? అనేది ఆసక్తిగా మారింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, చిన్న శ్రీను పార్టీ మారడం ద్వారా ఒక రకమైన క్లారిటీ వచ్చిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో వారసత్వ రాజకీయాల వివాదం, బొత్స ఫ్యామిలీ ఆధిపత్యంపై కొంతకాలంగా పార్టీ కేడర్‌లో ఉన్న అసంతృప్తికి దీనితో తెరపడింది. చిన్న శ్రీను వెళ్ళిపోవడంతో జగన్ చాలా సీరియస్‌గా స్పందించి, చిన్న శ్రీను బావ బడ్డుకొండ అప్పలనాయుడిపై కూడా వేటు వేసి తన షాక్ ట్రీట్మెంట్ రుచి చూపించారు. అంటే, పార్టీలో లాయల్టీ లేని వారిని ఏరిపారేసే వ్యూహంలో జగన్ ఉన్నారనే సంకేతాలు వెళ్లినా, ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుత పరిణామాలు చూస్తే బొత్స సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో బాగా డిఫెన్స్‌లో పడ్డారని అర్థమవుతోంది. చిన్న శ్రీను కేవలం తాను మాత్రమే టీడీపీలోకి వెళ్లలేదు, ఆపరేషన్ వైసీపీ పేరుతో బొత్స పునాదులను కదిలిస్తున్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలానికి చెందిన ప్రెసిడెంట్, ఏకంగా 13 గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు సామూహికంగా వైసీపీకి రాజీనామా చేసి చిన్న శ్రీను బాటలోనే నడుస్తామని ప్రకటించారు. ఇన్నాళ్లూ గ్రౌండ్ లెవెల్ కేడర్‌ను మేనేజ్ చేసింది చిన్న శ్రీను కావడంతో, ఆ క్యాడర్ అంతా ఇప్పుడు టీడీపీ వైపు షిఫ్ట్ అవుతోంది.

దీనివల్ల బొత్స తన సొంత అడ్డాలోనే వీక్ అయిపోయి, ఒంటరిగా మారిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ పొలిటికల్ ఈక్వేషన్‌లో బొత్స సత్యనారాయణకు ఇప్పుడు వైసీపీలో కొనసాగడం మినహా వేరే చాయిస్ లేకుండా పోయిందనేది నగ్న సత్యం. మేనల్లుడు చిన్న శ్రీను ఆల్రెడీ టీడీపీలో చేరిపోయి, చీపురుపల్లిలో బొత్సకు వ్యతిరేకంగా చక్రం తింపుతున్నారు కాబట్టి బొత్సకు ఇప్పుడు టీడీపీ లేదా కూటమి వైపు వెళ్లే తలుపులు పూర్తిగా మూసుకుపోయాయి. జగన్ ఆల్రెడీ బొత్స ఫ్యామిలీ ప్రవర్తనపై గుర్రుగా ఉన్న ఇలాంటి తరుణంలో బొత్స పార్టీ మారే సాహసం చేస్తే, అటు కేడర్ లేకుండా, ఇటు పార్టీ అధిష్టానం నమ్మకం కోల్పోయి రాజకీయంగా మరింత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే చీపురుపల్లి నుంచి తానే మళ్లీ పోటీ చేస్తానని బొత్స ప్రకటిస్తూ, కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. మొత్తానికి చిన్న శ్రీను వేసిన స్కెచ్‌తో బొత్సకు వైసీపీలో కంటిన్యూ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

The post చిన్న శ్రీను జగన్ సమస్య తీర్చాడా..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఓట్ల చోరీపై గులాబీ పార్టీ మౌనం ఎందుకు..?ఒకవైపు లాఠీలు, అరెస్టులు.. మరోవైపు కంటితుడుపు పదోన్నతుల జీవోలా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com