☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

నాడే ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే నేడు మేయర్ సీటు..?

విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి జనసేన వైపు అడుగులు వేస్తుండటం వెనుక రెండేళ్ళ రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. అయితే, ఈ హఠాత్ పరిణామంపై విజయవాడ నగర టీడీపీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నాయి. రాధా ఇప్పుడు జనసేన వైపు వెళ్లడం వెనుక గతంలో టీడీపీ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పక్కన పెట్టడమే ప్రధాన కారణమని స్థానిక […] The post నాడే ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే నేడు మేయర్ సీటు..? appeared first on Telugu Rajyam.
నాడే ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే నేడు మేయర్ సీటు..?

విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి జనసేన వైపు అడుగులు వేస్తుండటం వెనుక రెండేళ్ళ రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. అయితే, ఈ హఠాత్ పరిణామంపై విజయవాడ నగర టీడీపీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నాయి. రాధా ఇప్పుడు జనసేన వైపు వెళ్లడం వెనుక గతంలో టీడీపీ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పక్కన పెట్టడమే ప్రధాన కారణమని స్థానిక తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు.

నిజానికి 2019 ఎన్నికల ముందే వంగవీటి రాధా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలు, వివిధ సామాజిక వర్గాల లెక్కల వల్ల రాధాకు ఆశించిన పదవి దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాధా, సరైన సమయం చూసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే యోచనలో కూటమి అధిష్ఠానం ఉందనే వార్తలు వస్తున్నాయి. వంగవీటి రాధాను జనసేన తరఫున బెజవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించితే కాపు, రజక, దళిత సామాజిక వర్గాల మద్దతుతో క్లీన్ స్వీప్ చేయవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీ కార్యకర్తలు మాత్రం నాడే చంద్రబాబు రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే, ఈరోజు విజయవాడలో ఇంత బలమైన సీటును జనసేనకు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పాత అసంతృప్తి జ్వాలలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

The post నాడే ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే నేడు మేయర్ సీటు..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జగన్ ట్వీట్‌కు సీజేపీ నేత రీట్వీట్.. ఏపీ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చ..!వంశీకి ధైర్యం పెరిగిందా..? తగ్గేదే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com