☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ట్రేడ్, తైవాన్‌‌‌‌, ఏఐపైనే నజర్‌‌‌‌‌‌‌‌.. వాణిజ్య ఒప్పందం మరో రెండు నెలలు పొడిగింపు: ట్రంప్-జిన్‌‌‌‌పింగ్ భేటీలో కీలక అంశాలు ఇవే!

ట్రేడ్, తైవాన్‌‌‌‌, ఏఐపైనే నజర్‌‌‌‌‌‌‌‌.. వాణిజ్య ఒప్పందం మరో రెండు నెలలు పొడిగింపు: ట్రంప్-జిన్‌‌‌‌పింగ్ భేటీలో కీలక అంశాలు ఇవే!
ట్రేడ్, తైవాన్‌‌‌‌, ఏఐపైనే నజర్‌‌‌‌‌‌‌‌.. వాణిజ్య ఒప్పందం మరో రెండు నెలలు పొడిగింపు: ట్రంప్-జిన్‌‌‌‌పింగ్ భేటీలో కీలక అంశాలు ఇవే!
ట్రేడ్, తైవాన్‌‌‌‌, ఏఐపైనే నజర్‌‌‌‌‌‌‌‌.. వాణిజ్య ఒప్పందం మరో రెండు నెలలు పొడిగింపు: ట్రంప్-జిన్‌‌‌‌పింగ్ భేటీలో కీలక అంశాలు ఇవే!
  • తైవాన్‌‌‌‌పై అమెరికా ఆచితూచి వ్యవహరించాలన్న చైనా
  • అమెరికన్‌‌‌‌ -చైనీస్‌‌‌‌ రుచులతో అదిరిపోయే డిన్నర్‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ మధ్య కీలక శిఖరాగ్ర భేటీ ఆసక్తికరంగా సాగింది. వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో జిన్‌‌‌‌పింగ్‌‌‌‌కు ట్రంప్ అదిరిపోయే రీతిలో గ్రాండ్ డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్‌‌‌‌కు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్ (టెస్లా), టిమ్ కుక్ (యాపిల్), జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా), సామ్ ఆల్ట్‌‌‌‌మన్ (ఓపెన్‌‌‌‌ ఏఐ) హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ విందు మెనూలో ప్రత్యేక వంటకాలను చేర్చారు.

వైల్డ్ మష్రూమ్స్, ఫ్రెష్ హెర్బ్స్, క్రిస్పీ పాన్‌‌‌‌సెట్టా, స్కాలియన్ ఆయిల్‌‌‌‌తో కూడిన ‘ఎల్లో స్క్వాష్ వెలౌటే’, నువ్వులతో చేసిన ‘సీ బాస్’ చేప వంటకం, బేబీ బోక్ చోయ్, రోస్టెడ్ వంకాయ , సాస్ వెర్టే లాంటివి ఏర్పాటు చేశారు. ఒకవైపు ఘన స్వాగతాలు, వేడుకలు కనిపించినా.. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు, ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా సమసిపోలేదు. ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా ట్రేడ్, తైవాన్ సంక్షోభం, ఏఐ వ్యవహారాలు కేంద్రబిందువుగా నిలిచాయి.

భేటీలో తేలిన కీలక అంశాలివే..

ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందం నవంబర్‌‌‌‌తో ముగియనుండగా.. దాన్ని మరో 2 నెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ఆర్థికపరమైన అంశాలపై మరింత సమగ్ర చర్చలు జరిపేందుకు ఈ సమయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, తైవాన్ విషయంలో అమెరికా ఆచితూచి అడుగులు వేయాలని జిన్‌‌‌‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని అమెరికా పూర్తిగా వ్యతిరేకించాలని కోరారు. అయితే, వైట్‌‌‌‌హౌస్ వర్గాలు మాత్రం తమ పాత విధానానికే కట్టుబడి ఉన్నట్టు సంకేతాలిచ్చాయి తప్ప.. చైనా డిమాండ్లపై అధికారిక వివరణ ఇవ్వలేదు.

ఏఐపై ఎవరి దారి వారిదే!

ఏఐ నియంత్రణ విషయంలో ట్రంప్‌‌‌‌, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ను ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా మార్చాలంటున్న ట్రంప్.. కొత్త ఆంక్షలు ఏవీ విధించకుండా, న్యాయశాఖకే వదిలేస్తే సరిపోతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే, జిన్‌‌‌‌పింగ్ మాత్రం ఏఐని మానవ నియంత్రణలోనే ఉంచాలని వాదించారు.

యుద్ధం వద్దు..

ఒక ఎదుగుతున్న శక్తి ఉన్న అగ్రరాజ్యాన్ని ఢీకొట్టినప్పుడు యుద్ధాలు అనివార్యమవుతాయనే ‘థుసిడిడెస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ అమెరికాను జిన్‌‌‌‌పింగ్ హెచ్చరించారు. రెండు దేశాల మధ్య పోటీ ఉండాలే తప్ప, గెలుపోటముల కోసం కుస్తీ పడే పరిస్థితి రావద్దని పేర్కొన్నారు. ట్రంప్ సైతం రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌‌‌‌పై కలిసి పోరాడిన చారిత్రక బంధాన్ని గుర్తుచేశారు.

లక్ష మంది అమెరికన్ స్టూడెంట్లకు జిన్‌‌‌‌పింగ్ ఆహ్వానం

ఈ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌‌పింగ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేండ్లలో లక్ష మంది యువ అమెరికన్లను విద్య, విద్యా సంబంధ ఎక్స్చేంజ్​కార్యక్రమాల కోసం చైనాకు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. 2023లో చేపట్టిన 50 వేల మంది లక్ష్యం గడువు కంటే ముందే పూర్తికావడంతో ఈ కొత్త ప్రకటన చేశారు. ‘‘చైనా–అమెరికా సంబంధాల భవిష్యత్తు ఇరుదేశాల యువత చేతుల్లోనే ఉంది. చైనా అభివృద్ధి, అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం కోసం పరస్పరం కలిసి సాగవచ్చు” అని జిన్‌‌‌‌పింగ్ పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారత్‌‌ స్థానం 131.. పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలంపొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com