☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

నరాల బలహీనతకు సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారన్న తినండి.. శరీరం బలంగా ఉక్కులా మారిపోయిద్ది..

వట్టి తునకలు తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ ఎండు మాంసం వంటకం. మేక మాంసానికి ఉప్పు, పసుపు అద్ది ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకునే ఈ పద్ధతి మాంసాన్ని ఎక్కువకాలం ఉపయోగించుకోవడానికి తోడ్పడుతుంది. ప్రొటీన్లు, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు ఉండే ఈ ఎండు మాంసాన్ని కూరగా లేదా ఫ్రైగా తయారుచేసుకోవచ్చు.
నరాల బలహీనతకు సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారన్న తినండి.. శరీరం బలంగా ఉక్కులా మారిపోయిద్ది..
Dry Mutton Process

వట్టి తునకలు.. శరీరానికి బలాన్నిచ్చే అద్భుతమైన ఆహారం.. పూర్వ కాలంలో మటన్ ఎండు మాంసం అధికంగా తినేవారు.. బలహీనంగా ఉన్నవారికి, బాలింతలకు శక్తి కోసం మేక మాంసం ముక్కలకు ఉప్పు, పసుపు అద్ది.. ఎండబెట్టేవారు.. అలా ఎండిన మాంసాన్నే వట్టి తునకలు అంటారు.. వట్టి తనకలు రుచికరంగా ఉండటంతోపాటు.. శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. ఈ మాంసం ముక్కలను మంచిగా దాచుకుని.. అవసరమైనప్పుడు ఎలాగైనా వండుకుని తినొచ్చు..

Vatti Thunakalu

ప్రొటీన్లు, విటమిన్లు, బీ12 సమృద్ధిగా ఉన్న వట్టి తునకలు.. ఎక్కువ పోషకాలు, ఖనిజాలు కలిగిన బలవర్ధకమైన ఆహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంకా శరీర, నరాల బలహీనతను తగ్గిస్తుంది. బాలింతలకు, శరీరం గట్టిపడటానికి, గాయాలు మానడానికి, జబ్బుల నుంచి కోలుకోవడానికి పురాతన కాలంలో ఎక్కువగా తినిపించేవారు. అందుకే.. నెలకు ఒకసారైనా వట్టితునకల కూరను తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.

Dry Mutton

తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలలో ఇది ప్రసిద్ధమైన, పోషకమైన వంటకం. వీటిని డ్రై మటన్, ఎండు తునకలు లేదా ఉప్పంచులు అని కూడా పిలుస్తారు. వట్టి తునకల తయారీ చాలా సరళమైనది.. ప్రాచీనమైనది. మటన్ ముక్కలను ఉప్పు మరియు పసుపుతో కలిపి, ఎండలో బాగా ఎండబెడతారు. ఈ ప్రక్రియ మాంసాన్ని డీహైడ్రేట్ చేసి, దానిని సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడుతుంది. సరిగ్గా ఎండబెట్టి, నిల్వ చేసినట్లయితే, ఈ వట్టి తునకలు ఏడాది పొడవునా చెడిపోకుండా ఉంటాయి.

Dry Mutton Curry

ఈ బలవర్ధకమైన ఎండు మాంసాన్ని కర్రీగా వండుకోవచ్చు లేదా నూనెలో వేయించుకొని ఫ్రైగా కూడా తీసుకోవచ్చు. రెండు రకాలుగానూ ఇది రుచికరంగా ఉంటుంది. వట్టి తునకలు కేవలం ఒక వంటకం మాత్రమే కాదు.. ఇది మాంసాన్ని సంరక్షించే ఒక సాంప్రదాయ పద్ధతికి నిదర్శనం..

Mutton Dry

అయితే.. సాధారణ మటన్ మాదిరి దీనిని వండుకుని తినవచ్చు.. ఇంకా టమాటా, దోసకాయ, గోంగూరలో కూడా వేసుకుని తినవచ్చు.. పెద్ద ఎత్తున వండాల్సిన పనిలేదు.. సుమారు 100 గ్రాముల మాంసంతో కుటుంబం మొత్తానికి అద్భుతంగా సరిపోతుంది. అయితే ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిమితంగా తీసుకోవడం, మాంసాన్ని సురక్షితంగా ఎండబెట్టి నిల్వ చేయడం ముఖ్యం. ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌!నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com