☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ట్రావెల్: అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు.. రాజుల కాలం నాటి.. ఈ ఆలయం తప్పక చూడాల్సిందే !

ట్రావెల్: అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు.. రాజుల కాలం నాటి.. ఈ ఆలయం తప్పక చూడాల్సిందే !
ట్రావెల్: అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు.. రాజుల కాలం నాటి.. ఈ ఆలయం తప్పక చూడాల్సిందే !
ట్రావెల్: అలంపూర్ గుడిలో అలనాటి శిల్పాలు.. రాజుల కాలం నాటి.. ఈ ఆలయం తప్పక చూడాల్సిందే !

రాజుల కాలం నాటి శిల్పకళ చూడాలంటే దేవాలయాల్ని మించిన ఛాయిస్ ఉండదు. 'ఆలయాల నగరం'గా పేరుగాంచిన అలంపూర్ అలాంటిదే. జోగులాంబ గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున అలంపూర్ లో వెలసింది శ్రీ జోగులాంబ. పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఐదోది ఈ గుడి. ఇక్కడ అమ్మవారు 'రౌద్ర స్వరూపిణి'గా కనిపిస్తారు. గుడి ఆవరణలోని కోనేరు అమ్మవారిని శాంతింపచేస్తుందని చెబుతారు. జోగులాంబ గుడి నిర్మాణ శైలి నగర ఆర్కిటెక్చర్ లో ఉంటుంది. గుడి మొత్తాన్ని ఒకటే రాయిని ఆధారంగా చేసుకుని కట్టడం నగర శైలి స్పెషాలిటీ. ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి.

వీటిని ఎర్రని ఇసుక రాయితో కట్టారు. తుంగభద్ర, కృష్ణా నదులు కలిసే చోటు కావడంతో దీన్ని 'దక్షిణ కాశి' అని కూడా పిలుస్తారు. పుష్కరాలకి జనం పోటెత్తుతారు. దసరా సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చండీ హోమాలు చేస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఆలయ గోడలపై పంచతంత్రం, రామాయణ, మహాభారత కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో ఇక్కడికి వెళ్తే బాగుంటుంది.

ఇవి కూడా చూడొచ్చు
అలంపూర్ కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాసి గ్రామంలో పాపనాసి దేవాలయాలు ఉంటాయి. వీటిని రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు కట్టించారు. ఏడు, ఎనిమిదో శతాబ్దం నాటి శిల్పకళని చూడాలంటే ఇక్కడికి వెళ్లాలి. ఇక్కడ దాదాపు 20 కి పైగా శివ లింగాలు, వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఉంటాయి. యజ్ఞశాల, ఆలయ పిల్లర్స్ మీద చెక్కిన అష్టాదశ శక్తిపీఠాల బొమ్మలు.. అదనపు ఆకర్షణ.

ఇలా వెళ్లాలి
గద్వాల్ నుంచి 61 కిలోమీటర్లు జర్నీ చేస్తే అలంపూర్ చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి అయితే 215 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

దర్శనం టైమింగ్స్: ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి. అలాగే మళ్ళి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు.

⬇ Full News JPG⬇ Short News JPG
← మాజీ DSP భీంరెడ్డి బినామీ ఇళ్లల్లో గుట్టలుగా నోట్ల కట్టలుఈసీ జ్ణానేష్ కుమార్ పెద్ద దేశద్రోహి: కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com