☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

గత ఒప్పందాల కన్నా భిన్నంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చిస్తున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వాణిజ్య ఒప్పందం గత ఒప్పందాల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మంగళవారం ట్రంప్ అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందం గురించి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘వారు ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారు. మేము కూడా ఒక ఒప్పందానికి రాబోతున్నాము. మేము చాలా దగ్గరగా ఉన్నాము.’’ అని అన్నారు. అయితే ఈ ఒప్పందం గత ఒప్పందాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్‌తో సమావేశమయ్యారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← SBI Cyber Attack: ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం… నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్‌.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com