☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

విదేశీ పామాయిల్‌‌‌‌కు రాయితీలిస్తే రైతుల పరిస్థితి ఏంటి? .. కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: దేశీయ ఆయిల్‌‌‌‌పామ్ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. ఒకవైపు రైతులను ఆయిల్‌‌‌‌పామ్ సాగువైపు ప్రోత్సహిస్తూనే, మరోవైపు విదేశీ పామాయిల్ దిగుమతులకు సుంకం తగ్గించడం వల్ల దేశీయ రైతుల ఉత్పత్తుల ధరలపై తీవ్రమైన ఒత్తిడి పడే ప్రమాదం ఉందని గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశీ పామాయిల్‌‌‌‌కు రాయితీలిస్తే మన రైతుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. క్రూడ్ పామ్ ఆయిల్ పై మొత్తం దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడం వల్ల దిగుమతులకు పోటీ ప్రయోజనం పెరుగుతుందని, ఇది ఆయిల్‌‌‌‌పామ్ గెలల (ఎఫ్ఎఫ్బీ) ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← అక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్మందమర్రిలో త్వరలో 50 పడకల ఆస్పత్రి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com