☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ Caption of Image. సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇటీవల హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని టి.అక్షితారాణి (20) కేసును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలోని అక్షితారాణి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్​ఠాకూర్​తో కలిసి మంత్రి గురువారం పరమర్శించారు. దళిత విద్యార్థిని అక్షితారాణికి బలవంతంగా పురుగుల మందు తాగించి పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. నిందితులను 24 గంటల్లోపు పోలీసులు అరెస్ట్ చేశారని, వారికి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అం
అక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇటీవల హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని టి.అక్షితారాణి (20) కేసును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలోని అక్షితారాణి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్​ఠాకూర్​తో కలిసి మంత్రి గురువారం పరమర్శించారు. దళిత విద్యార్థిని అక్షితారాణికి బలవంతంగా పురుగుల మందు తాగించి పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు.

నిందితులను 24 గంటల్లోపు పోలీసులు అరెస్ట్ చేశారని, వారికి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రూ.4.12 లక్షల పరిహారం అందించారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్​సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని విప్ విజయ రమణారావు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్ రావు, రామగుండం సీపీ, జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ లో జర్నలిస్ట్ టీకే రమేశ్ మరణించగా, ఆయన కుటుంబాన్ని మంత్రి, ఎమ్మెల్యేలు పరామర్శించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే?విదేశీ పామాయిల్‌‌‌‌కు రాయితీలిస్తే రైతుల పరిస్థితి ఏంటి? .. కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com