☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అదృష్టం బాగుంటే ఐఫోన్‌.. లేకపోతే చాక్లెట్‌!

తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించి, కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు యూఏఈకి చెందిన ఓ కంపెనీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ అనే ప్రముఖ మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ తమ సిబ్బంది కోసం ఒక వినూత్నమైన గిఫ్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులను అభినందిస్తూ ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు యాజమాన్యం ఈ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది. కంపెనీ అధికారులు ప్యాక్‌ చేసిన […] The post అదృష్టం బాగుంటే ఐఫోన్‌.. లేకపోతే చాక్లెట్‌! appeared first on Adya News Telugu.
అదృష్టం బాగుంటే ఐఫోన్‌.. లేకపోతే చాక్లెట్‌!

తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించి, కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు యూఏఈకి చెందిన ఓ కంపెనీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ అనే ప్రముఖ మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ తమ సిబ్బంది కోసం ఒక వినూత్నమైన గిఫ్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులను అభినందిస్తూ ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు యాజమాన్యం ఈ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది.

కంపెనీ అధికారులు ప్యాక్‌ చేసిన అనేక గిఫ్ట్‌ బాక్స్‌లను వరుసగా పేర్చారు. వాటిలో నుంచి తమకు నచ్చిన బాక్స్‌ను ఎంచుకుని తీసుకోవాల్సిందిగా ఉద్యోగులకు సూచించారు. ఉత్సాహంగా ముందుకు వచ్చిన ఓ ఉద్యోగి మొదట ఒక గిఫ్ట్‌ బాక్స్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో ఖరీదైన ఐఫోన్‌ ఉండడంతో ఆయన ఆశ్చర్యానికి, సంతోషానికి గురయ్యాడు. ఆ తర్వాత మరో ఉద్యోగి తాను ఎంచుకున్న గిఫ్ట్‌ప్యాక్‌ను ఓపెన్‌ చేయగా అందులో కేవలం చాక్లెట్ మాత్రమే వచ్చింది. అదృష్టం బాగున్న వాళ్లను ఖరీదైన ఐఫోన్లు వరించగా, మిగిలిన కొందరికి మాత్రం కేవలం చాక్లెట్లు మాత్రమే దక్కాయి.

అయితే ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరిచే మరో నిర్ణయం తీసుకుంది. మొదట కేవలం చాక్లెట్లు మాత్రమే పొందిన సిబ్బంది అందరికీ చివర్లో కంపెనీ తరఫున ప్రత్యేకంగా ఐఫోన్లను బహూకరించింది. దీంతో ఉద్యోగులందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమను ఇంతగా గుర్తించి విలువనిచ్చినందుకు వారంతా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అద్భుతమైన వీడియోను కంపెనీ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆయన భార్య హసీనా నిషాద్ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘మన ఉద్యోగుల అంకితభావం, సామూహిక శ్రమ నుంచే సంస్థ నిజమైన విజయం సాధిస్తుంది. ప్రతి ఒక్కరి సహకారం మాకు ఎంతో ముఖ్యం’ అని హసీనా తెలిపారు. ఉద్యోగులను గౌరవించిన ఈ కంపెనీ తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

The post అదృష్టం బాగుంటే ఐఫోన్‌.. లేకపోతే చాక్లెట్‌! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!14 రోజులు ఈ రాశులవారికి కష్టాల సునామీ.. జాగ్రత్త! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com