☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియాతో జరగబోయే కీలకమైన వన్డే సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ట్రోఫీలు సాధించాలంటే ముందుగా భారత్‌ను చావుదెబ్బ కొట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచి ఏకంగా 24 ఏళ్లు అవుతోందని గుర్తుచేశారు. ఈసారైనా తమ జట్టుపై గెలిచేందుకు అద్భుతమైన అవకాశముందని సామీ ధీమా వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే భారత్ వంటి బలమైన జట్లను అడ్డుకునే రీతిలో […] The post భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు! appeared first on Adya News Telugu.
భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియాతో జరగబోయే కీలకమైన వన్డే సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ట్రోఫీలు సాధించాలంటే ముందుగా భారత్‌ను చావుదెబ్బ కొట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచి ఏకంగా 24 ఏళ్లు అవుతోందని గుర్తుచేశారు. ఈసారైనా తమ జట్టుపై గెలిచేందుకు అద్భుతమైన అవకాశముందని సామీ ధీమా వ్యక్తం చేశారు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే భారత్ వంటి బలమైన జట్లను అడ్డుకునే రీతిలో తమ ఆటతీరు ఉండాలని సామీ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో తమ జట్టు కచ్చితంగా అర్హత సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టులో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారని కొనియాడారు.

షెయ్ హోప్‌తో పాటు అమీర్ జంగూ, రూథర్‌ఫోర్డ్‌, అల్జారీ జోసెఫ్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో తమ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోందని సామీ చెప్పారు. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియాను ఈసారి సిరీస్‌లో నేలమట్టం చేసి ట్రోఫీతో ఇంటికి వెళతామని హెచ్చరించారు. ఐపీఎల్ ఆడటం వల్ల తమ ప్లేయర్లకు భారత పిచ్‌లు, పరిస్థితులపై మంచి అనుభవముందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో తొలి వన్డేకు కేవలం ఒక్క రోజే సమయం ఉన్న తరుణంలో సామీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

కాగా, భారత గడ్డపై వెస్టిండీస్ జట్టు చివరిసారిగా 2002లో మాత్రమే వన్డే సిరీస్ గెలిచింది. అప్పట్లో కార్ల్ హూపర్ కెప్టెన్‌గా ఉండగా, సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియాపై విండీస్ 4-3 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నోసార్లు భారత్‌లో పర్యటించినప్పటికీ విండీస్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది.

భారత్ – వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే తిరువనంతపురంలో, రెండో మ్యాచ్ గౌహతిలో సెప్టెంబర్ 30న, చివరి మ్యాచ్ అక్టోబర్ 3న న్యూ ఛండీఘర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగుతుండటం విశేషం. వన్డేల తర్వాత అక్టోబర్ 6 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

The post భారత్‌తో వన్డే సిరీస్.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘ది ప్యారడైజ్‌’ సినిమా టాక్.. స్పందించిన నాని!అదృష్టం బాగుంటే ఐఫోన్‌.. లేకపోతే చాక్లెట్‌! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com