Hyderabad Crime: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక సంస్థలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని టార్గెట్ చేసి, అక్కడే ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాధితురాలికి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీడియోలతో బ్లాక్‌మెయిల్.. ఏళ్ల తరబడి వేధింపులు
2023లో మొదలైన ఈ దుశ్చర్యకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను నిందితుడు షేక్‌నబీ రహస్యంగా రికార్డు చేశాడు. ఆ వీడియోలను అడ్టుగా పెట్టుకుని బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు. ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, అప్పటి నుంచి 2026 ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Read also: Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం.. రేపు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
Hyderabad Crime: భరించలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
నిందితుడి వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. రాయదుర్గం పోలీసులకు తన ఆవేదనను వెళ్లగక్కుతూ ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షేక్‌నబీని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:






