UPI : యుపిఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల లావాదేవీలకు మినహాయింపు ఇచ్చే దిశగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా పెట్రోల్ బంకులలో జరిగే డిజిటల్ చెల్లింపులపై విధిస్తున్న MDR ఛార్జీల ఉపసంహరణ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై పెట్రోల్ బంక్ డీలర్లు లావాదేవీకి రూ. 5 చొప్పున MDR ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ (AIPDA) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, స్పందించిన ప్రభుత్వం ఈ మినహాయింపు అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది.
Read Also : ప్రాంక్ పేరుతో ప్రమాదకర చర్య.. యువకుడికి తీవ్ర గాయాలు

డీలర్ల నిరసన – వినియోగదారులపై ప్రభావం పడకుండా చర్యలు
పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలపై డీలర్లకు లభించే కమిషన్ శాతం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో UPI లావాదేవీలపై ప్రతి చెల్లింపునకు రూ. 5 MDR ఛార్జీ విధిస్తే అది తమకు అధనపు భారం అవుతుందని, వ్యాపారం నడపడం కష్టతరంగా మారుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా ప్రోత్సాహకాల్లో భాగంగా నగదు రహిత చెల్లింపులను పెంచేందుకు ప్రయత్నిస్తున్న వేళ, ఇలాంటి ఛార్జీలు డిజిటల్ లావాదేవీలను నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. డీలర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు, సామాన్య వినియోగదారులపై ఎలాంటి పరోక్ష భారం పడకుండా చూసేందుకు కేంద్రం త్వరలోనే పెట్రోల్ బంకులకు MDR మినహాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :


