☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

EC ఆఫీసుల ఎదుట రేపు కాంగ్రెస్ నిరసనలు

EC : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో...
EC ఆఫీసుల ఎదుట రేపు కాంగ్రెస్ నిరసనలు

EC : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్నికల సంఘం (EC) కార్యాలయాల ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తన అన్ని రాష్ట్రాల కమిటీలను (PCCలు) ఆదేశించింది. జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో పాటు, ఓటర్ల జాబితాలో జరిపిన మార్పులు, చేర్పులపై నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు జరపాలని, ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది.

Read Also : ప్రాంక్‌ పేరుతో ప్రమాదకర చర్య.. యువకుడికి తీవ్ర గాయాలు

telangana congress new dcc presidents
telangana congress new dcc presidents

ఈ నెల 28న రెండో విడత ఆందోళనలు: కేసీ వేణుగోపాల్ ప్రకటన

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని, నిష్పాక్షికతను కాపాడేందుకే ఈ పోరాటమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మొదటి విడతలో భాగంగా రేపు ఈసీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం జరగనుండగా, ఆ తర్వాతి విడత పోరాట కార్యాచరణను కూడా పార్టీ ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన రెండో దశ ఆందోళనల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పునరుద్ధరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్యాంకుల సమ్మె.. రేపే అకౌంట్లలోకి జీతాలుUPI ఛార్జీల నుంచి పెట్రోల్ బంకులకు ఊరట? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com