☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

US Oil Tariffs India: భారత్‌కు ట్రంప్ బిగ్ రిలీఫ్.. రష్యా చమురుపై ఆంక్షలు రద్దు.. ఇండియాకి జరిగిగే లాభం ఇదే!

రష్యా చమురు దిగుమతులపై భారత్‌కు ఎలాంటి ఆంక్షలు, సుంకాలు ఉండవని అమెరికా (US Oil Tariffs India)అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
US Oil Tariffs India: భారత్‌కు ట్రంప్ బిగ్ రిలీఫ్.. రష్యా చమురుపై ఆంక్షలు రద్దు.. ఇండియాకి జరిగిగే లాభం ఇదే!

US Oil Tariffs India: ప్రపంచ ఇంధన మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఉత్కంఠభరిత పరిణామాల వేళ భారత్‌కు అమెరికా నుంచి అత్యంత ఊరటనిచ్చే వార్త అందింది. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించాలనుకున్న భారీ టారిఫ్‌ల నుంచి భారత్‌తో సహా మరో ఐదు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపునిచ్చారు. జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

Read Also – Flight Ticket Prices: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం ప్లాన్.. సుప్రీంకోర్టులో కీలక ప్రకటన!

‘ది లిండ్సే ఓ. గ్రాహం చట్టం – 2026’ నేపథ్యం:

ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా కాంగ్రెస్ ‘ది లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ను తెచ్చింది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే భారత్, చైనాల వంటి దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. భారత్ తన ముడిచమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా, అందులో రష్యా వాటానే 45 శాతంగా ఉంది. ఒకవేళ ఈ టారిఫ్‌లు అమలైతే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేది.

పశ్చిమాసియా సంక్షోభం.. ఆచితూచి వ్యవహరిస్తున్న వాషింగ్టన్:

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆటంకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఏర్పడింది. ఈ తరుణంలో రష్యా సరఫరాలపై ఆంక్షలు విధిస్తే మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడుతుందని అమెరికా భావించింది. తమ ఇంధన భద్రతే ప్రాధాన్యమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేయగా, ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ఆయిల్ ధరలను అదుపులో ఉంచేందుకే ట్రంప్ యంత్రాంగం ఆంక్షల నిలిపివేత వైపే మొగ్గుచూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TDP Candidates First List: స్థానిక సమరానికి టీడీపీ తొలి జాబితా విడుదల.. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన!Flight Ticket Prices: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం ప్లాన్.. సుప్రీంకోర్టులో కీలక ప్రకటన! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com