☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

చిన్న‌ప్పుడే డ‌బ్బుల‌డిగా: వెంకటేశ్‌

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యాంకర్ సుమా కనకాలతో వెంకటేశ్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన సినీ ప్రయాణం నాటి పాత జ్ఞాపకాలను […] The post చిన్న‌ప్పుడే డ‌బ్బుల‌డిగా: వెంకటేశ్‌ appeared first on Adya News Telugu.
చిన్న‌ప్పుడే డ‌బ్బుల‌డిగా: వెంకటేశ్‌

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ యాంకర్ సుమా కనకాలతో వెంకటేశ్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన సినీ ప్రయాణం నాటి పాత జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు. ఆయన తండ్రి దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన ‘ప్రేమనగర్’ చిత్రంలో వెంకటేశ్ బాలనటుడిగా నటించారు. ఆ సినిమా సమయంలోని వెంకీ చిన్ననాటి ఫొటోను సుమ ఈ ఇంటర్వ్యూలో చూపించారు.

ఆ ఫొటో చూడగానే వెంకటేశ్ నాటి సరదా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను స్కూలు మైదానంలో ఆడుకుంటున్నానని చెప్పారు. ఆ సమయంలో తమ ప్రొడక్షన్ మేనేజర్ అక్కడికి వచ్చారు. నాన్నగారు రమ్మంటున్నారని ఆయన చెప్పారు. ఎందుకని అడగ్గా, సినిమాలో ఓ చిన్న పాత్ర చేయించాలని ఆయన అనుకుంటున్నారని మేనేజర్ తెలిపారు.

షూటింగ్‌లో జూనియర్ ఆర్టిస్టులకు నాన్నగారు డబ్బులు ఇవ్వడం తాను ముందే గమనించానని వెంకీ చెప్పారు. దాంతో ‘మరి నాతో యాక్ట్ చేయిస్తే నాకు కూడా డబ్బులు ఇస్తారా?’ అని తాను మేనేజర్‌ను అడిగినట్లు నవ్వుతూ తెలిపారు. ఆ విషయాన్ని మేనేజర్ వెళ్లి రామానాయుడికి చెప్పగా, ఆయన వెంటనే నవ్వి వెయ్యి రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు.

ఆ తర్వాత వెంకటేశ్ షూటింగ్‌కు వెళ్లారు. ‘ప్రేమనగర్’ చిత్రంలో నటుడు కైకాల సత్యనారాయణ చిన్ననాటి పాత్రలో ఆయన నటించారు. అలా తన మొదటి పాత్రకే నాన్న వద్ద రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన జ్ఞాపకాన్ని వెంకటేశ్ సరదాగా పంచుకున్నారు. ఆయన చెప్పిన ఈ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

The post చిన్న‌ప్పుడే డ‌బ్బుల‌డిగా: వెంకటేశ్‌ appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 9 లక్షలకు పైగా ఉద్యోగాలను యూట్యూబ్ సృష్టించింది!క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com