Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లికి ముందు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ ప్రేమ జంట ఎప్పుడూ వార్తలో నిలుస్తూనే ఉంటుంది. విజయ్, రష్మిక పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రణబాలి సినిమా కోసం గుర్రాన్ని నడపడం నేర్చుకున్నాను. అది చాలా కష్టం. చాలా సార్లు కింద పడి దెబ్బలు తగిలించుకున్నాను. కానీ గుర్రంతో మంచి ఎమోషన్ ఏర్పడింది. నేను కూడా గుర్రం పెంచుకోవాలి అని అనుకున్నాను. కానీ గుర్రం ఒకటే పెంచకూడదు. దానికి తోడు ఉండాలి. లేకపోతే గుర్రం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే మాకు పిల్లలు పుట్టేలోపు ఒక స్థలం చూసి ఒక రెండు గుర్రాలు తెచ్చుకొని పెంచుకుంటాను అని తెలిపాడు.






