☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Chuttamalle Deepfake | ‘చుట్టమల్లె’ పాట డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. అది డిజిటల్ లైంగిక దాడితో సమానం!

Vijay Deverakonda | దేవర సినిమాలోని పాపులర్ సాంగ్ చుట్టమల్లె (Chuttamalle)కు సంబంధించి ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయిన ఏఐ డీప్‌ఫేక్ వీడియో టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.
Chuttamalle Deepfake | ‘చుట్టమల్లె’ పాట డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. అది డిజిటల్ లైంగిక దాడితో సమానం!

Vijay Deverakonda | దేవర సినిమాలోని పాపులర్ సాంగ్ చుట్టమల్లె (Chuttamalle)కు సంబంధించి ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయిన ఏఐ డీప్‌ఫేక్ వీడియో టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను ఆయన ‘డిజిటల్ లైంగిక దాడి’ (Digital Sexual Assault) గా అభివర్ణించారు.

అంతకుముందు, ఈ నకిలీ వీడియోపై హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే. ఆయనకు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ.. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించి, ఇతరులకు ఒక గుణపాఠంగా మార్చాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మనం అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయాము. ఇలాంటి వారికి ఎలాంటి రక్షణ ఉండకూడదు. వీరికి అత్యంత కఠినమైన చట్టపరమైన శిక్షలు అమలు చేయాలి” అని మండిపడ్డారు. ఇతరుల అవమానాన్ని చూసి ఆనందించేలా మనుషులు ఎందుకు ఇంతటి సంస్కారహీనంగా మారుతున్నారని, వీరికి ఎలాంటి పెంపకం దొరికిందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీని కొందరు పనికిమాలిన పనులకు వాడుకుంటున్నారని, ఇది డిజిటల్ లైంగిక దాడితో సమానమని స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇది సిగ్గుచేటైన చర్య అని, దీన్ని క్రియేట్ చేసినా, షేర్ చేసినా ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ తరహా నేరాలపై ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరారు. మరోవైపు, ఈ డీప్‌ఫేక్ వీడియో లింక్‌ల కోసం కొందరు ఆన్‌లైన్‌లో అడుగుతున్న తీరును ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తీవ్రంగా తప్పుబట్టారు.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన దేవర చిత్రం 2024 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ చిత్రంలోని చుట్టమల్లె రొమాంటిక్ సాంగ్ ఎంతటి అద్భుతమైన ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Medicover | కంగ్రాచ్యులేషన్స్ రేవంత్ గారు.. మెడికవర్‌ ఆస్పత్రి ముందు వెలిసిన బ్యానర్లుSingeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com