☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల!

Singeetham Srinivasa Rao | దర్శక మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన కథలు, సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ మహాదర్శకుడి మరణంతో చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప శకం ముగిసినట్టైంది.
Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల!

Singeetham Srinivasa Rao | దర్శక మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన కథలు, సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ మహాదర్శకుడి మరణంతో చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప శకం ముగిసినట్టైంది.ఆఖరి వరకు సినిమాపై ఉన్న ప్రేమను మాత్రం సింగీతం శ్రీనివాసరావు వదులుకోలేదు. ఇప్పటికే 61 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. వయసు మీద పడుతున్నా మరో సినిమా చేయాలనే తపనతోనే ఉన్నారు. ఇటీవల జూన్‌లో విడుదలైన ‘సింగ్ గీతం’ ఆయన దర్శకత్వంలో వచ్చిన 61వ చిత్రంగా నిలిచింది. అయితే అక్కడితో తన ప్రయాణాన్ని ముగించాలని ఆయన అనుకోలేదు.

తన 62వ చిత్రంగా మరో వినూత్నమైన కథను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన శిష్యుడు, ‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా వెల్లడించారు. సింగీతం శ్రీనివాసరావు నిర్వహించిన వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రస్తావించారు. ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తన 62వ సినిమాను తెరకెక్కించాలని సింగీతం శ్రీనివాసరావు భావించారు. టైటిల్‌లోనే ఆయన ఆలోచనా విధానం, ప్రయోగాత్మక దృక్పథం కనిపిస్తుందని సినీ అభిమానులు చెబుతున్నారు.అయితే ఈ ఆలోచనను తెరపైకి తీసుకురాకముందే సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం విషాదకరం. 61 సినిమాలు చేసినా ఇంకా కొత్త కథ చెప్పాలనే ఉత్సాహం ఆయనలో తగ్గలేదనడానికి ఈ 62వ సినిమా ఆలోచనే నిదర్శనం.

ఇప్పుడు ఆయన ఆలోచనగా మిగిలిపోయిన ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ ఎప్పుడైనా తెరకెక్కుతుందా? ఒకవేళ తెరకెక్కితే నాగ్ అశ్విన్ స్వయంగా ఆ బాధ్యత తీసుకుంటారా? లేక మరెవరైనా సింగీతం గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా తీయాలనే తపనతో చివరి వరకు ప్రయాణించిన ఈ మహాదర్శకుడి 62వ సినిమా ఆలోచన మాత్రం ఆయన సృజనాత్మక వారసత్వంలో మరో గుర్తుగా మిగిలిపోనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Chuttamalle Deepfake | ‘చుట్టమల్లె’ పాట డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. అది డిజిటల్ లైంగిక దాడితో సమానం!Sircilla | సిరిసిల్ల అంబ భవాని ఆలయ ఉత్సవ కమిటీ ఎన్నిక →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com