Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ IRS ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది.. రుషికొండ ఐటి సెజ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ IRS ఉద్యోగి ఆనంద కుమార్ ను కిడ్నాప్ చేశారు.. ఈ ఘటన PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. రిటైర్డ్ GST కమిషనర్ ఆనంద కుమార్ కిడ్నాప్ కేసు కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించారు పీఎం పాలెం పోలీసులు.. అనంద కుమార్ కొద్ది రోజుల క్రితం వరకు సీతమ్మదార ఆక్సిజన్ టవర్ లో నివాసం ఉండేవారు.. ఆనంద కుమార్ విశాఖలోనే GST కమిషనర్ గా పని చేసి ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యారు..
ఇక, రిటైర్ అయ్యాక ఇక్కడ నుండి హైదారాబాద్లో శంషాబాద్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు.. 16 తేదీన ఋషికొండ ప్రాంతంలో రిసార్ట్ నుండి బయటకు వచ్చే సమయంలో ఐటి సెజ్ జంక్షన్ లో కారుని అపి.. అదే కారులో కిడ్నాప్ చేసారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. వెంటనే కారు డ్రైవర్ పీఎం పాలెం ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు తక్కువ వ్యవది లోనే విశాలాక్షి నగర్ లో ఓ అపార్ట్మెంట్లో కిడ్నాప్ అయిన వ్యక్తితో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.. ఆనంద కుమార్ ఉద్యోగాల పేరుతో కొంత మంది నుండి 15 కోట్లు తీసుకున్నారని, వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మొహం చాటేశారు.. అందులో కొందరికి సుమారు 7 కోట్ల వరకు ఇవ్వటం జరిగిందని సమాచారం.. మిగతా డబ్బు ఇవ్వకపోవటంతో ఇక్కడ నుండి వేరే చోటకి వెళ్లిపోతున్నారని తెలుసుకొని ఆనంద్ కుమార్ని కిడ్నాప్ చేసారు.. కిడ్నాప్కు పాల్పడిన 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. అందులో ముగ్గురు విశాఖకు చెందినవారు ఆరుగురు హైదారాబాద్కు చెందినవారుగా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






